Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండుసార్లు అబార్షన్.. చివరకు నమ్మకద్రోహం.. ప్రియురాలి ఆవేదన

రెండుసార్లు అబార్షన్.. చివరకు నమ్మకద్రోహం.. ప్రియురాలి ఆవేదన

వార్త 3 weeks ago

Mahabubabad news: 'నన్ను పెళ్లి చేసుకుని నీతో కలిసి జీవించనివ్వు.. లేదా ఇద్దరం కలిసి పురుగుల మందు తాగి చనిపోదాం' అంటూ ఓ ప్రియురాలు తనను మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి, మౌన పోరాటానికి దిగింది.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో శనివారం జరిగిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్తగూడ మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన జూల రాజు, స్రవంతి దంపతుల కుమారుడు వంశీకి.. అదే గ్రామానికి చెందిన భైరబోయిన సుభాష్, శిరీష దంపతుల రెండవ కుమార్తె మనీషాతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా క్రమంగా గాఢమైన ప్రేమగా మారింది. “నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి” అంటూ వంశీ ఒత్తిడి చేయడంతో.. అతడు ఉద్యోగం చేస్తున్న ఇనుగూర్తి గ్రామంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇద్దరూ సహజీవనం సాగించారు. పెళ్లి చేసుకుంటానని గట్టిగా నమ్మబలికి వంశీ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.

Read Also : Rayilapur Fire Accident: రాయిలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం!

 A girlfriend’s silent struggle in front of her cheating boyfriend’s house!

Mahabubabad news: రెండుసార్లు అబార్షన్.. చివరకు నమ్మకద్రోహం!

సహజీవనం సాగిస్తున్న క్రమంలో మనీషా గర్భవతి కాగా.. వంశీ అసలు రంగు బయటపడింది. “నువ్వు ఇప్పుడు అబార్షన్ చేయించుకుంటేనే తర్వాత మన పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకుంటారు” అని నమ్మించి, ఆమెకు బలవంతంగా రెండుసార్లు అబార్షన్ చేయించినట్లు బాధితురాలు కన్నీటితో తన ఆవేదనను వ్యక్తం చేసింది. తీరా ఇప్పుడు పెళ్లి చేసుకోమని నిలదీస్తే.. “మా ఇంట్లో అస్సలు ఒప్పుకోవట్లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను” అంటూ మాయమాటలతో ముఖం చాటేశాడు. అన్ని రకాలుగా వాడుకుని, తన జీవితాన్ని నాశనం చేసిన ప్రియుడి నమ్మకద్రోహాన్ని తట్టుకోలేకపోయిన మనీషా.. చివరకు న్యాయం కోసం పొగళ్లపల్లిలోని వంశీ ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది.

బాధితురాలి డిమాండ్:

నన్ను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వంశీతోనే నాకు వివాహం జరిపించాలి. అతను దక్కకపోతే నాకు చావే శరణ్యం. పోలీసులు, ఉన్నతాధికారులు స్పందించి నాకు జరిగిన ఘోర అన్యాయానికి న్యాయం చేయాలి అని బాధితురాలు వేడుకుంది.

యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగిన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొత్తగూడ ఎస్ఐ రాజ్‌కుమార్ బాధితురాలితో మాట్లాడి, ఆమెను శాంతింపజేసి నచ్చజెప్పారు. ప్రియుడు వంశీపై లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని ఎస్ఐ కోరారు. నిందితుడిని వెంటనే స్టేషన్‌కు పిలిపించి, కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు, చట్టప్రకారం పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని ఎస్ఐ గట్టి హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో సంతృప్తి చెందిన మనీషా.. వారితో కలిసి ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నాగర్‌కర్నూల్‌లో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు అక్కడికక్కడే మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha