Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపటి నుంచే పీజీఈసెట్ కౌన్సెలింగ్.. జులై 13న వెబ్ ఆప్షన్లు!

రేపటి నుంచే పీజీఈసెట్ కౌన్సెలింగ్.. జులై 13న వెబ్ ఆప్షన్లు!

వార్త 3 weeks ago

TG pgecet 2026 counselling: తెలంగాణ రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎంఈ, ఎంటెక్, ఎం.ఆర్క్, ఎం.ఫార్మసీ, ఫార్మా-డీ (P.B.) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 2 (గురువారం) నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది.

తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ రెండు వేర్వేరు స్ట్రీమ్‌లుగా జరగనుంది.

Read Also:AP EAPCET result 2026: ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి!

రెండు స్ట్రీమ్‌లుగా కౌన్సెలింగ్.. ముఖ్యమైన తేదీలు ఇవే

ఈ ఏడాది గేట్ (GATE), జీపాట్ (GPAT) మరియు TG PGECET అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు సర్టిఫికెట్ల అప్‌లోడ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

1. ఇంజనీరింగ్ స్ట్రీమ్ (M.E. / M.Tech. / M.Arch.) టైమ్‌లైన్

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు: జులై 2 నుంచి జులై 9, 2026 వరకు
  • ప్రత్యేక కేటగిరీల ఫిజికల్ వెరిఫికేషన్ (NCC, CAP, PH): జులై 7 నుంచి జులై 9, 2026 వరకు (Directorate of Admissions, OU, Hyderabad).
  • వెరిఫైడ్ లిస్ట్ డిస్‌ప్లే: జులై 12, 2026
  • ఫేజ్-1 వెబ్ ఆప్షన్ల నమోదు:జులై 13 నుంచి జులై 15, 2026
  • వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్ విండో: జులై 16, 2026
  • మొదటి విడత సీట్ల కేటాయింపు (Seat Allotment):జులై 19, 2026
  • కళాశాలల్లో రిపోర్టింగ్ & ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్: జులై 20 నుంచి జులై 24, 2026 వరకు.

2. ఫార్మసీ స్ట్రీమ్ (M.Pharm. / Pharm.D - P.B.) టైమ్‌లైన్

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & సర్టిఫికెట్ల అప్‌లోడ్: జులై 26 నుంచి జులై 31, 2026 వరకు
  • ఫేజ్-1 వెబ్ ఆప్షన్ల నమోదు: ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6, 2026 వరకు
  • మొదటి విడత సీట్ల కేటాయింపు: ఆగస్టు 10, 2026
  • కళాశాలల్లో రిపోర్టింగ్: ఆగస్టు 11 నుంచి ఆగస్టు 14, 2026 వరకు.

Epaper: epaper.vaartha.com

రైల్వే గ్రూప్-డి ఫలితాలు విడుదల..మెరిట్ లిస్ట్ డైరెక్ట్ లింక్ ఇదే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha