Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపటి నుంచి 4 రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన

రేపటి నుంచి 4 రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన

వార్త 3 weeks ago

Shanghai Summit 2026 : భారత ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజుల పాటు కీలకమైన విదేశీ పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు మొదటగా ఆ దేశ రాజధాని తాష్కెంట్‌ను సందర్శిస్తారు.

ఈ దైపాక్షిక పర్యటనలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య మరియు రక్షణ రంగ్‌లలో దైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై అధినేతలు విస్తృతంగా చర్చించనున్నారు. భారత్-ఉజ్బెకిస్థాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో ఈ పర్యటన ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.


బిష్కెక్ షాంఘై సమ్మిట్: అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాధాన్యతలు

ఉజ్బెకిస్థాన్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకుంటారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో అక్కడ జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరవుతారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వంటి అగ్రదేశాల నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ భేటీ సందర్భంగా ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిర్మూలన, ఆర్థిక సహకారం మరియు కనెక్టివిటీ విస్తరణపై ప్రధాని మోదీ భారత దృక్పథాన్ని స్పష్టంగా వినిపించనున్నారు.

వాహన బీమా గడువు ముగిస్తే భారీ జరిమానా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha