MS Dhoni IPL Retirement: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ముగింపునకు వస్తున్న తరుణంలో ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై సస్పెన్స్ క్లైమాక్స్‌కు చేరింది.
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఒక్క మ్యాచ్‌లో కూడా మైదానంలోకి దిగని ధోనీ, తన ఐపీఎల్ కెరీర్‌కు శాశ్వతంగా గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రేపు చెన్నైలోని చేపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్ ఈ సీజన్‌లో సీఎస్కేకు సొంతగడ్డపై చివరి మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్ సందర్భంగా చేపాక్ స్టేడియంలో అభిమానులకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఎదురుకాబోతుందని, అక్కడ ఎలాంటి ఆశ్చర్యకరమైన నిర్ణయం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే చేసిన వ్యాఖ్యలు క్రికెట్ సర్కిల్స్‌లో సంచలనంగా మారాయి.
Read Also :IPL 2026 Today Match: నేడే RCB, PBKS ఫైట్.. 100వ సారి టాస్‌కు రానున్న శ్రేయస్ అయ్యర్
MS Dhoni IPL Retirement:హర్షా భోగ్లే ట్వీట్ వైరల్

మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం అత్యంత అవసరం. ఇలాంటి జీవన్మరణ పోరాటంలో ధోనీ జట్టు కోసం నేరుగా గ్లోవ్స్ తొడిగి రీఎంట్రీ ఇస్తారా, లేక మ్యాచ్ ఆడకుండానే మైదానంలోకి వచ్చి అభిమానుల సమక్షంలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా అనేది రేపటితో తేలిపోనుంది. కెరీర్ అంతటా తన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచే అలవాటున్న ‘థాలా’ ధోనీ, తన హోమ్ గ్రౌండ్ అయిన చేపాక్‌లోనే కెరీర్‌కు ముగింపు పలకాలని భావిస్తున్నట్లుగా వస్తున్న సంకేతాలు సీఎస్కే అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

