Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు విడుదల

రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు విడుదల

వార్త 2 weeks ago

JEE Advanced 2026 Results: దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) 2026 ఫలితాలు రేపు, సోమవారం ( జూన్ 1 ) విడుదల కానున్నాయి.

ఈ ఏడాది పరీక్షను విజయవంతంగా నిర్వహించిన ఐఐటీ రూర్కీ (IIT Roorkee) ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువరించింది.

Read Also :Kerala PSC : 18 ఏళ్ల తర్వాత ఉద్యోగం.. కానీ చేరలేని పరిస్థితి!

ఉదయం 10 గంటలకే స్కోర్‌కార్డులు

JEE Advanced Cutoff Marks

సోమవారం ఉదయం 10:00 గంటలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులు, స్కోర్‌కార్డులతో పాటు ఆలిండియా ర్యాంకులను (All India Ranks) తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఫైనల్ కీ (Final Answer Key) కూడా విడుదల కానుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 1,80,000 మంది (లక్షా 80 వేల మంది) విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఐఐటీల్లో ప్రవేశాలకు గానూ దాదాపు 45,000 మంది విద్యార్థులు అర్హత (Qualification) సాధించే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

JEE Advanced 2026 Results: తగ్గనున్న కటాఫ్ (Cut-off) మార్కులు

ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రశ్నపత్రం గత ఏడాదితో పోలిస్తే కాస్త కఠినంగా (Tough) ఉన్నట్లు పరీక్ష రాసిన విద్యార్థులు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రశ్నపత్రం క్లిష్టత ఎక్కువగా ఉండటం కారణంగా.. ఈసారి ఐఐటీల్లో సీటు సాధించడానికి అవసరమైన కటాఫ్ మార్కులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది తక్కువ మార్కులు వచ్చినప్పటికీ మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఊరటనిచ్చే అంశం. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ర్యాంకులను చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో (NITs) సీట్ల కేటాయింపునకు సంబంధించిన జోసా (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha