Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్టాండప్ కమెడియన్ షో అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు.. పాత జోకులపై రగడ!

స్టాండప్ కమెడియన్ షో అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు.. పాత జోకులపై రగడ!

వార్త 1 month ago

Bengaluru: బెంగళూరులో జరిగిన ఒక స్టాండప్ కామెడీ షోలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ కమెడియన్ శరత్ ఉదయ్ తన ప్రదర్శన ఇస్తుండగా, కొందరు తెలుగుదేశం పార్టీ ( TDP) కార్యకర్తలు అక్కడికి చేరుకుని షోను అడ్డుకున్నారు.

తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడుపై గతంలో వేసిన జోకులను ప్రస్తావిస్తూ వారు కమెడియన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Read Also:Anantapur: బీసీల అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 Bengaluru: TDP workers disrupt stand-up comedian’s show

రెండేళ్ల నాటి వ్యవహారం మళ్లీ సెగలు

దాదాపు రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి శరత్ ఉదయ్ కొన్ని జోకులు వేశారు. అప్పట్లోనే దీనిపై నిరసనలు వ్యక్తమవ్వగా, ఆ కమెడియన్ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, తాజాగా బెంగళూరులో ఆయన షో నిర్వహిస్తున్నారని తెలుసుకున్న కార్యకర్తలు, పాత విషయాలను మళ్ళీ తెరపైకి తెచ్చి బూతులతో రెచ్చిపోయారు. “మా నాయకుడి పైనే జోకులు వేస్తావా?” అంటూ స్టేజ్‌పైనే వాగ్వివాదానికి దిగారు.

భద్రతపై ఆందోళన

ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఇలా వ్యక్తిగతంగా దూషిస్తూ షోను అడ్డుకోవడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భావప్రకటనా స్వేచ్ఛకు ఇది భంగం కలిగించడమేనని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతుండగా, రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని మరికొందరు హెచ్చరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

తిరుపతిలో ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్న బంక్ యజమాని!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha