Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. బియ్యంతో పాటు మరో 6 సరుకులు

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. బియ్యంతో పాటు మరో 6 సరుకులు

వార్త 1 day ago

Telangana Ration Items: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక అద్భుతమైన శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్..

ఇకపై బియ్యంతో పాటు మరో ఆరు రకాల నిత్యావసర సరుకులను కూడా రాయితీ (సబ్సిడీ) ధరలకే అందించాలని యోచిస్తోంది.

Anganwadi Recruitment: అంగన్‌వాడీ దరఖాస్తులకు ఈరోజే లాస్ట్!

 Good news for ration card holders: 6 additional items along with rice

Telangana Ration Items: రేషన్ షాపుల్లో లభించనున్న ఆరు నిత్యావసరాలు ఇవే:

పేద, మధ్యతరగతి కుటుంబాలపై మార్కెట్‌లో పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల ద్వారా..

  1. గోధుమపిండి
  2. కందిపప్పు
  3. పామాయిల్
  4. చక్కెర
  5. చింతపండు
  6. కారం పొడి

ఈ ఆరు ముఖ్యమైన సరుకులను పంపిణీ చేసే ప్రతిపాదనపై పౌరసరఫరాల శాఖ ప్రస్తుతం ముమ్మర కసరత్తు చేస్తోంది.

అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

ఈ అంశంపై పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. సరుకుల సేకరణ ఎక్కడి నుంచి చేయాలి? కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా ఎంత పరిమాణంలో ఇవ్వాలి? నిల్వ, రవాణా, పంపిణీ విధానం ఎలా ఉండాలి? తదితర అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, ఈ పథకం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా పడే ఆర్థిక భారాన్ని కూడా అంచనా వేయాలని స్పష్టం చేశారు.

ఎల్ నినో ప్రభావం.. ముందస్తు ఆహార భద్రత!

రాబోయే కాలంలో ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల వర్షాలు తగ్గే అవకాశం ఉండటం, దానివల్ల పంటల దిగుబడి తగ్గి బహిరంగ మార్కెట్లో ధరలు మరింత విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఆహార భద్రత లోపించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ముందడుగు వేసింది.

ప్రస్తుతం తెలంగాణలో సుమారు 3.42 కోట్ల మంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు. నెలవారీగా దాదాపు 2.38 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుండగా, ప్రభుత్వ గోదాముల్లో సరిపడా నిల్వలు ఉన్నాయి. త్వరలోనే అధికారుల నుంచి పూర్తి నివేదిక అందాక, ఈ కొత్త సరుకుల పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? లబ్ధిదారులకు ధరలు ఎంత ఉంటాయి? అనే అంశాలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం గనుక అమలైతే రేషన్ కార్డుదారుల నెలవారీ గృహ ఖర్చులు గణనీయంగా తగ్గి పెద్ద ఊరట లభించనుంది.

Epaper: epaper.vaartha.com

అక్టోబర్ 30 నుంచి టెన్త్ ఫీజులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha