Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేవంత్ ఇంటి ఎదుట రాహుల్ ధర్నా చేస్తారా - కేటీఆర్ సూటి ప్రశ్న

రేవంత్ ఇంటి ఎదుట రాహుల్ ధర్నా చేస్తారా - కేటీఆర్ సూటి ప్రశ్న

వార్త 1 month ago

Rahul : ఢిల్లీ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నా చేపట్టిన నేపథ్యంతో, తెలంగాణ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయన వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

‘ఢిల్లీలో ఒక రకం, తెలంగాణలో మరో రకమా?’ అంటూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ నీతిని ప్రశ్నిస్తూ కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు.

ఢిల్లీలో ఒక తీరు… తెలంగాణలో మరో తీరు

కేటీఆర్ ఫైర్ఢిల్లీలో విద్యార్థుల హక్కుల కోసం పెద్ద ఎత్తున మాట్లాడే రాహుల్ గాంధీ, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులపై జరుగుతున్న పోలీసు దౌర్జన్యాలను ఎందుకు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక్కడ విద్యార్థులపై లాఠీఛార్జ్‌లు, అరెస్టులు జరుగుతున్నా నోరు మెదపకపోవడం వెనుక ఉన్న కారణాన్ని నిలదీశారు. తెలంగాణ విద్యార్థులపై పోలీసు బలగాలు ఉపయోగించినా స్పందించరా అని సెటైరికల్ ప్రశ్నలు వేశారు.

రేవంత్ రెడ్డి ప్యాలెస్ ఎదుట ధర్నా చేస్తారా?

తెలంగాణ విద్యార్థుల రాజ్యాంగ హక్కులు కాంగ్రెస్ పాలనలో కాలరాస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. “ఢిల్లీలో విద్యార్థుల వైపు నిలబడే నైతిక ధైర్యం మీకు ఉంటే, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్యాలెస్ ఎదుట ధర్నా చేసే ధైర్యం ఉందా?” అని సూటిగా సవాల్ విసిరారు. కొట్టింది సొంత కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఈ దౌర్జన్యాలను మౌనంగా సమర్థిస్తున్నారా అని కేటీఆర్ తన ప్రకటనలో తీవ్రంగా ఎండగట్టారు.

భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ పేరు మార్పు కోసం ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha