Harish Rao Challenge To Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే లిఫ్ట్ చేయడం లేదని హరీశ్ రావు ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ.. తనకు కేవలం 3 నెలల పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరారు. ఎలాంటి జీతం, ప్రభుత్వ కారు, సిబ్బంది లేకుండానే కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తెచ్చి చూపిస్తానని, అలా చేయలేకపోతే రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు గతంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొనడంపై హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ అనుమతి ఒప్పంద పత్రాలను (MoU) రేవంత్ రెడ్డి బహిరంగపర్చాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అది నిజమని నిరూపిస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
Read Also: Pawan Kalyan tribute to Niranjan: నిరంజన్ మరణం పట్ల పవన్ కళ్యాణ్ భావోద్వేగ నివాళి!
Challenge To Revanth Reddy
Harish Rao Challenge To Revanth Reddy : కాంగ్రెస్ అవినీతిపై ధ్వజం
గతంలో కాంగ్రెస్ హయాంలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల రూపంలో నేతలు రూ.2,328 కోట్లు లూటీ చేశారని హరీశ్ రావు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ అడ్వాన్స్ విధానాన్ని రద్దు చేశామని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద కేవలం 160 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని సీడబ్ల్యూసీ (CWC) నివేదిక ఇచ్చిందని, అందుకే 240 టీఎంసీల లభ్యత ఉన్న మేడిగడ్డ వద్ద అన్ని అనుమతులతో బ్యారేజీ నిర్మించామని స్పష్టం చేశారు. 2022లో వచ్చిన భారీ వరదలకు కన్నెపల్లి పంప్‌హౌస్ మునిగిపోయినప్పుడు, తాము కేవలం 45 రోజుల్లోనే మరమ్మతులు చేసి మోటార్లను పునరుద్ధరించామని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఆ మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు వస్తాయని, కానీ బీఆర్ఎస్‌ను బదనాం చేయడానికే ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడం లేదని విమర్శించారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రం పాలు అవుతుంటే, కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రైతులను కన్నీరు పెట్టిస్తోందని దుయ్యబట్టారు.
Epaper: epaper.vaartha.com
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ప్రాక్టికల్ పరీక్షల విధానంలో భారీ మార్పులు!

