Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ప్రాక్టికల్ పరీక్షల విధానంలో భారీ మార్పులు!

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ప్రాక్టికల్ పరీక్షల విధానంలో భారీ మార్పులు!

వార్త 4 days ago

TG Inter Exams: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యా మండలి (TGBIE) కీలక ప్రకటన చేసింది. సైన్స్ గ్రూపుల (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) ప్రాక్టికల్ పరీక్షల విధానంలో బోర్డు భారీ మార్పులు తీసుకువచ్చింది.

ఇకపై ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు విడివిడిగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఒక అధికారిక సర్క్యులర్‌ను విడుదల చేసింది.

Read Also:AP EAPCET 2026: ఈనెల 15 నుంచి ఈఏపీసెట్ కౌన్సెలింగ్

సరికొత్త మార్కుల విధానం – గంటన్నరే పరీక్ష

నూతన మార్పుల ప్రకారం సైన్స్ సబ్జెక్టుల థియరీ పరీక్షలు యథాతథంగా 60 మార్కులకే ఉంటాయి. అయితే, ప్రాక్టికల్స్ విధానాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు.

  • మార్కుల విభజన: గతంలో కేవలం ద్వితీయ సంవత్సరంలోనే 30 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహించేవారు. కానీ ఇకపై ప్రథమ సంవత్సరానికి 15 మార్కులు, ద్వితీయ సంవత్సరానికి 15 మార్కుల చొప్పున కేటాయించారు.
  • పరీక్ష వ్యవధి: ఇంటర్ మొదటి సంవత్సరం సైన్స్ ప్రాక్టికల్ పరీక్షను 1 గంట 30 నిమిషాల (90 నిమిషాలు) వ్యవధిలోనే నిర్వహించనున్నారు.
  • వీటికి సంబంధించిన ప్రాక్టికల్ సిలబస్, మోడల్ క్వశ్చన్ పేపర్లు, నెలవారీ షెడ్యూల్‌తో కూడిన ల్యాబ్ మాన్యువల్స్‌ను బోర్డు ఇప్పటికే తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ల పర్యవేక్షణలోనే పరీక్షలు

నూతన విధానం ప్రకారం రెండు సంవత్సరాల్లోనూ బోర్డు నియమించే ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ల (External Examiners) పర్యవేక్షణలోనే ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు (DIEOs) ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించనున్నారు. ల్యాబ్‌లలో విద్యార్థుల భద్రతా ప్రమాణాలు పాటించడంతో పాటు, పరీక్ష పూర్తయిన వెంటనే మార్కులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని బోర్డు ఆదేశించింది.

TG Inter Exams: జూనియర్ కాలేజీలకు బోర్డు కీలక ఆదేశాలు

ఈ నూతన విద్యా విధానాన్ని పక్కాగా అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వార్షిక అకాడమిక్ ప్లాన్ ప్రకారం రెగ్యులర్‌గా ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాలని, పరీక్షల నాటికి విద్యార్థులు అన్ని ప్రయోగాలు పూర్తి చేసేలా చూడాలని పేర్కొంది. విద్యార్థులు తప్పనిసరిగా సర్టిఫైడ్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్‌ను (Certified Practical Record Book) పరీక్ష సమయంలో ఎగ్జామినర్‌కు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha