Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేవంత్ తొలి విజయానికి 20 ఏళ్లు.. నేడు భారీ సభ

రేవంత్ తొలి విజయానికి 20 ఏళ్లు.. నేడు భారీ సభ

వార్త 3 weeks ago

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో నేడు అత్యంత ప్రాధాన్యత కలిగిన మైలురాయి. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తొలి విజయాన్ని అందుకుని సరిగ్గా 20 ఏళ్లు పూర్తయింది.

2006, జులై 4న నాటి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ జెడ్పీటీసీ (ZPTC) స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా (Independent) బరిలోకి దిగి రేవంత్ రెడ్డి సంచలన విజయం సాధించారు. ఆ చిన్న గ్రామీణ స్థాయి గెలుపే నేడు ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం వరకు నడిపించింది. ఈ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని మరియు తన తొలి విజయ క్షేత్రాన్ని గుర్తుచేసుకుంటూ రేవంత్ రెడ్డి నేడు మిడ్జిల్‌లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తన ప్రస్థానానికి పునాది వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి ఈ సభను ఒక వేదికగా మార్చుకోనున్నారు.

రూ. 350 కోట్ల అభివృద్ధి పనులు - ఆలయ దర్శనంతో పర్యటన ప్రారంభం

తన రాజకీయ పురిటిగడ్డ అయిన మిడ్జిల్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో దాదాపు రూ. 350 కోట్ల విలువైన పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారం… సీఎం రేవంత్ రెడ్డి ముందుగా నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండకు చేరుకుంటారు. అక్కడ ప్రసిద్ధ ఊర్కొండ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మిడ్జిల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం రాక సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేశాయి.

బండ్ల గణేష్‌కు చుక్కెదురు.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha