Ponguleti Srinivas Reddy:తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నూతన రెవెన్యూ కార్యాలయాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఇందులో భాగంగా సుమారు 600 కోట్ల రూపాయల భారీ నిధులతో 180 తహసిల్దార్ మరియు ఆర్డీవో నూతన భవనాలను నిర్మించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దీనిద్వారా ఉద్యోగులకు మరియు ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
Read also: Harish Rao emotional: పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో హరీశ్ రావు కన్నీళ్లు
Good news for Telangana revenue employees.
తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటైనప్పటికీ సరైన కార్యాలయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 600 కోట్లతో తహసిల్దార్ మరియు ఆర్డీవో కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో నూతన తహసిల్దార్ కార్యాలయ భవనానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Ponguleti Srinivas Reddy:భూసమస్యలకు శాశ్వత పరిష్కారంగా సమగ్ర భూ సర్వే
రాష్ట్రంలో భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. తొలి విడతగా ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సమగ్ర భూ సర్వే చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే రెండు సంవత్సరాలలో ప్రతి గ్రామంలోని ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి భౌగోళిక కోఆర్డినేట్స్‌తో కూడిన మ్యాప్‌లను రూపొందిస్తామన్నారు. రైతులకు పూర్తి భూ హక్కులు మరియు భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.
Epaper: epaper.vaartha.com

