Registrations Department Revenue: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో భూములకు సంబంధించిన మార్కెట్ విలువలు పెరుగుతాయనే నేపథ్యంలో రాష్ట్ర జానాకు సమకూరే ఆదాయంలో పెరుగుదల చోటు చేసుకుంది.
ఇందులో భాగంగా మే నెలలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ఆర్థిక శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది అదే నెలలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఈ సారి 24.2 శాతం వృద్ధి రేటు నమోదైంది.
Read Also: Telangana Inter Board: 134 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుమతి ఇవ్వలేదు
Rs. 1,698.96 crore through registrations
Registrations Department Revenue: గతేడాదితో పోల్చితే పెరిగిన రాబడి
ఈ యేడాది మే నెలాఖరుకు వచ్చిన ఆదాయం రూ.1,698.96 కోట్లుగా రికార్డయింది. అదే గత ఏడాది మే నెలలో ఇదే కాలానికి వచ్చిన ఆదాయం రూ.1,367.93 కోట్లు. గతేడాదితో పోల్చితే ఈసారి అదనంగా రూ.331.03 కోట్లు ఆదాయం సమకూరింది. అయితే రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల పరంగా చూస్తే మాత్రం కొంత తగ్గుదల కనిపిస్తోంది. 2025 మే నెలలో 1.48 లక్షల దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1.47 లక్షలకు పరిమితం అయింది. ఈ విధంగా దస్తావేజుల సంఖ్య దాదాపు వెయ్యి తగ్గినప్పటికీ, ఆదాయ పరంగా మాత్రం పెరగడం అధిక విలువ కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు తెలుస్తోంది.
జూన్ నెలలో మరింత పెరుగుతుందని అంచనా
దీంతో పాటు, త్వరలో మార్కెట్ విలువల పెంపు ఉంటుందనే ప్రచారం రాష్ట్రంలో విస్తృతంగా సాగుతుండటంతో. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే రెండు నెలల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని సాధించింది. గతంతో పోల్చితే ఈ ఏడాది ఇది రూ.624.38 కోట్ల వృద్ధి కనిపించింది. ఇక జూన్ నెలలో ఈ మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శాఖ 5.3.107.31 ఆదాయం.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

