Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్

రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్

వార్త 1 day ago

Abhishek ShAbhishek Sharma IPL Recordsarma : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సంచలన ఫామ్‌ను కొనసాగిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన కీలక పోరులో మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన ఈ యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. ప్రత్యర్థి బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు. కేవలం 22 బంతుల్లోనే 5 సిక్సర్లు, 4 ఫోర్ల సహాయంతో 56 పరుగుల ఫైర్‌పవర్ ఇన్నింగ్స్ ఆడి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ సాగించే క్రమంలోనే అభిషేక్ శర్మ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Read Also : ఆర్సీబీని చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్!

క్రిస్ గేల్ సరసన అభిషేక్ శర్మ – తొలి భారతీయ క్రికెటర్‌గా అరుదైన ఘనత

ఈ ఐపీఎల్ సీజన్‌లో అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ సృష్టిస్తూ ఇప్పటివరకు మొత్తం 43 సిక్సర్లను బాదాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో 40 కంటే ఎక్కువ (40+) సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి భారతీయ (Indian) బ్యాటర్‌గా అభిషేక్ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. అంతకుముందు 2024 ఐపీఎల్ సీజన్‌లోనూ అతను ఏకంగా 42 సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 3 వేర్వేరు సీజన్లలో 40+ సిక్సర్లు కొట్టి యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు గేల్ తర్వాతి స్థానంలో నిలిచిన ఏకైక ఇండియన్‌గా అభిషేక్ శర్మ రికార్డు పుటల్లోకెక్కాడు. టీ20 క్రికెట్‌లో పవర్‌ప్లేను ఎలా వాడుకోవాలో చూపిస్తున్న ఈ యువ సెన్సేషన్‌పై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha