Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే

రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే

వార్త 2 weeks ago

Gold Rate Today: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పసిడి ధరలు మరోసారి రికార్డు స్థాయిలకు చేరుకోగా.. వెండి ధర కూడా భారీగా ఎగబాకింది.

దీంతో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారిపై ధరల పెరుగుదల ప్రభావం పడనుంది.

Read Also :China's staggering strategy : అమెరికాను దెబ్బ కొట్టేలా చైనా దిమ్మతిరిగే వ్యూహం

22 క్యారెట్ల బంగారం ధర ఎంతంటే?

హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,300 పెరిగి రూ.1,42,850కు చేరుకుంది. వరుసగా ధరలు పెరుగుతుండటంతో పసిడి కొనుగోలుదారులు మరింత అప్రమత్తంగా ధరలను గమనిస్తున్నారు.

24 క్యారెట్ల గోల్డ్ రేట్

ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,420 పెరిగి రూ.1,55,840 పలుకుతోంది. స్వచ్ఛమైన బంగారానికి డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు తదితర అంశాలు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

వెండి ధరలోనూ భారీ పెరుగుదల

బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 పెరిగి రూ.2,60,000కు చేరుకుంది. బంగారం, వెండి ధరలు రోజువారీగా మారే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, ముడిచమురు ధరలు, దేశీయ డిమాండ్ వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయి.

తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో స్వల్ప తేడాలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరలను ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చు. అలాగే ఆభరణాల కొనుగోలు సమయంలో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు తదితరాలు అదనంగా వర్తించవచ్చు.

మిశ్రమంగా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha