Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

వార్త 2 months ago

Retired Employees : తెలంగాణలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద గుడ్‌న్యూస్ చెప్పింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం తాజాగా రూ.

2,000 కోట్లను విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం.. రాబోయే వంద రోజుల్లో మొత్తం రూ. 6,000 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పుడు తొలి విడతగా రూ. 2,000 కోట్లను సర్కార్ రిలీజ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తమ సొంత సొమ్ము కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది పెన్షనర్లకు ఈ నిర్ణయం ఎంతో ఊరటను ఇస్తోంది.

Read Also : రాష్ట్ర అభివృద్ధికి రూ. లక్ష కోట్ల బడ్జెటేతర రుణాలు!

బకాయిల క్లియరెన్స్.. పెన్షనర్ల ఆర్థిక కష్టాలకు చెక్!

ఈ నిధుల విడుదలతో మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న మొత్తం జీపీఎఫ్, అలాగే కమ్యూటేషన్ (ఉద్యోగ విరమణ సమయంలో పొందే లంప్‌సమ్ మొత్తం) బకాయిలన్నీ పూర్తిగా చెల్లించినట్లయిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిలిచిపోయిన ఈ నిధులు ఒకేసారి విడుదల కానుండటంతో రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుందని పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల ప్రణాళికతో బకాయిలను క్లియర్ చేస్తున్న తీరుపై సచివాలయ వర్గాల్లో సానుకూల స్పందన వస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్: సంచలనం రేపిన అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha