Jharkhand Teacher Appointment Retirement: ఒక పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగం సాధించి స్థిరపడాలని, సమాజంలో గౌరవంగా బతకాలని ఆయన జీవితమంతా కలలు కన్నారు.
ఆ కల నెరవేర్చుకోవడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు, పరీక్షలు రాశారు. చివరకు ఆయన అనుకున్నట్లుగానే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామక పత్రం (Appointment Letter) చేతికి అందింది. కానీ, ఆ సంతోషాన్ని ఆస్వాదించే లోపే విధి, ప్రభుత్వ వ్యవస్థ కలిసి ఆయనతో ఒక విచిత్రమైన ఆట ఆడాయి. ఉద్యోగంలో చేరిన మరుసటి రోజే ఆయన వయస్సు 60 ఏళ్లు నిండడంతో పదవీ విరమణ (Retirement) చేయాల్సి వచ్చింది. కేవలం ఒక్క రోజు ముచ్చటగా సాగిన ఈ హృదయ విదారక, ఆసక్తికర సంఘటన జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో వెలుగుచూసింది.
20 ఏళ్ల నిరీక్షణ.. చివరి నిమిషంలో ఆర్డర్!

జార్ఖండ్‌లోని జామ్‌తారా జిల్లాకు చెందిన నంద్‌లాల్ రావణి (Nandlal Rawani) అనే ఉపాధ్యాయుడు 2006 నుంచి చాలా తక్కువ వేతనానికి పారా టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎలాగైనా పర్మినెంట్ అసిస్టెంట్ టీచర్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఆయన 2016లో జార్ఖండ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (JTET) రాసి అర్హత సాధించారు. అయితే, అక్కడి ప్రభుత్వ నియామక ప్రక్రియల్లో దొర్లిన తీవ్ర ఆలస్యం, న్యాయపరమైన చిక్కుల కారణంగా ఆ ఫైల్ దాదాపు పదేళ్ల పాటు ముందుకు కదలలేదు.
తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్రవ్యాప్తంగా 1,042 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ మెగా రిక్రూట్‌మెంట్‌లో నంద్‌లాల్ రావణి కూడా ఎంపికయ్యారు. జూన్ 29న ఆయనకు అధికారికంగా నియామక పత్రం లభించింది. అయితే, జూన్ 30 నాటికి ఆయనకు 60 ఏళ్లు పూర్తి కావడంతో, జూలై 1 నాటికి ఆయన అధికారికంగా పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. అంటే, పర్మినెంట్ గవర్నమెంట్ టీచర్‌గా ఆయన సర్వీస్ కాలం కేవలం ఒక్క రోజే కావడం గమనార్హం.
ఎలా స్పందించాలో తెలియని స్థితిలో మాస్టారు..
నియామక పత్రం అందుకున్న సమయంలో నంద్‌లాల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కళ్ల వెంట నీళ్లు తిరుగుతుండగా ఆయన మీడియా ముందు తన ఆవేదనను పంచుకున్నారు. శాశ్వత ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అవ్వాలన్నది నా జీవితకాల ఆశయం. ఆ కల నెరవేరినందుకు సంతోషించాలో.. లేక ఒక్క రోజులోనే ఆ ఉద్యోగం ముగిసిపోతున్నందుకు బాధపడాలో తెలియని స్థితిలో ఉన్నాను. ఈ ఉద్యోగం నా జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.” - నంద్‌లాల్ రావణి, ఉపాధ్యాయుడు
Jharkhand Teacher Appointment Retirement: వ్యవస్థా లోపానికి ఇదో నిదర్శనం!
జార్ఖండ్‌లో ప్రభుత్వ నియామకాల జాప్యం కారణంగా నంద్‌లాల్ లాంటి ఎంతోమంది సీనియర్ అభ్యర్థులు నష్టపోతున్నారు. పలాము జిల్లాకు చెందిన నయీమ్ అన్సారీ అనే వ్యక్తి దాదాపు 24 ఏళ్ల పాటు పారా టీచర్‌గా పనిచేశారు. తీరా ప్రభుత్వం నియామక పత్రం అందజేసే సమయానికి.. కేవలం నెల రోజుల ముందే (మే 31న) ఆయనకు 60 ఏళ్లు నిండిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగం చేజారిపోయింది. ఖుంటీ జిల్లాకు చెందిన ఈమెకు దాదాపు పాతికేళ్ల నిరీక్షణ తర్వాత 54 ఏళ్ల వయస్సులో పర్మినెంట్ నియామకం లభించింది. ఆమెకు సర్వీస్‌లో కేవలం ఆరేళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పరిపాలనా విభాగాల మందకొడితనం, తాత్సార ధోరణి వల్ల అభ్యర్థుల జీవితాల్లో అత్యంత కీలకమైన కాలం ఎలా వృథా అవుతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని విద్యా రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com
కేవలం రిజిస్ట్రేషన్ సరిపోదు.. ఆచారాలు ఉంటేనే హిందూ వివాహం చెల్లుతుంది: గుజరాత్ హైకోర్టు

