Atiq Ahmed Son Dies: గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దివంగత అతీక్ అహ్మద్ కుటుంబంలో మరొక విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ (21) ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
ఝాన్సీ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న తన సోదరుడు అలీ అహ్మద్‌ను కలిసేందుకు వెళ్తుండగా, ఝాన్సీ-కాన్పూర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘోర దుర్ఘటన జరిగింది.
Read Also : Rajahmundry crime: దారుణం.. మెడికల్ విద్యార్థిని పై కారు ఎక్కించిన యువకులు
Gangster Atiq Ahmed’s youngest son killed in a road accident.
Atiq Ahmed Son Dies: డివైడర్‌ను ఢీకొట్టిన అతివేగం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్ నుంచి అబాన్‌తో పాటు మరో నలుగురు వ్యక్తులు హ్యుందాయ్ క్రెటా కారులో ఝాన్సీకి ప్రయాణమయ్యారు. ఉదయం సుమారు 10:30 గంటల ప్రాంతంలో పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే, వారు ప్రయాణిస్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను అత్యంత బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయైంది. ఈ ప్రమాదంలో అబాన్ అహ్మద్‌తో పాటు సోను అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఉమర్ అహ్మద్, మహమ్మద్ జైద్, అస్లాం తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఝాన్సీలోని మెడికల్ కాలేజీకి తరలించారు.
హైవేపై అకస్మాత్తుగా ఏదైనా జంతువు అడ్డురావడంతో, దానిని తప్పించే క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మహిళపై అత్యాచార ఆరోపణలతో లాహోర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ సస్పెండ్

