Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దారుణం.. మెడికల్ విద్యార్థిని పై కారు ఎక్కించిన యువకులు

దారుణం.. మెడికల్ విద్యార్థిని పై కారు ఎక్కించిన యువకులు

వార్త 18 hrs ago

Rajahmundry crime:రాజమండ్రి నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఇరవై ఎనిమిదేళ్ల ప్రియాంక సినిమా చూసేందుకు ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్యా మాల్‌కు వెళ్లింది.

మాల్ పార్కింగ్ ప్రాంతంలో వాహనం నిలిపే సమయంలో కొందరితో చిన్న వాగ్వాదం జరిగింది. ఈ చిన్న గొడవ పెద్ద వివాదంగా మారి ఒక నిండు ప్రాణం ప్రమాదంలో పడేలా చేసింది.

Read also: Karnataka Lift Accident: లిఫ్ట్‌లో చిక్కుకుని రిటైర్డ్ ఇంజినీర్ మృతి!

కారుతో ఢీకొట్టిన నిందితులు

నామవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డారు. పార్కింగ్ వద్ద జరిగిన వాగ్వాడంతో కోపంతో ఊగిపోయిన ఆ యువకులు అతివేగంగా కారు నడిపారు. స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను వెనుక నుంచి కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆమె రోడ్డుపై కింద పడిపోగా దుండగులు కనికరం లేకుండా ఆమె తలపై నుంచి కారు పోనిచ్చారు.

Rajahmundry crime:మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ప్రియాంకను మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించారు. వైద్యులు ఆమెను పరిశీలించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ప్రకాశ్‌నగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Epaper: epaper.vaartha.com

కేమికల్ ఫ్యాక్టరీలో ఘోరం: గ్యాస్ లీకై ముగ్గురు దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha