Male Breast Cancer Symptoms: రొమ్ము క్యాన్సర్ అంటే కేవలం మహిళలకే వస్తుందనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ, ఇది పురుషులకు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారిలో ఈ ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది. పురుషులలో ఉండే రొమ్ము కణజాలంపై ఈ క్యాన్సర్ ప్రభావం చూపుతుంది. సిగ్గు పడకుండా సరైన సమయంలో డాక్టర్‌ను సంప్రదించడం వల్ల ఈ ప్రమాదం నుండి సులభంగా బయటపడవచ్చు.
Read also: Fermented Rice : ఉదయాన్నే చద్దన్నం తింటే ఎన్నో ప్రయోజనాలు !!
Male Breast Cancer Awareness Symptoms
Male Breast Cancer Symptoms: ప్రధాన కారణాలు: ఈ హార్మోన్ల మార్పులే అసలు శత్రువులు!
పురుషులలో రొమ్ము క్యాన్సర్ రావడానికి హార్మోన్ల అసమతుల్యత ప్రధాన కారణం. శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గి, ఈస్ట్రోజెన్ పెరగడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. దీనితో పాటు
- అధిక బరువు ఉండటం వల్ల శరీరంలో కొవ్వు పెరగడం.
- కాలేయ సంబంధిత (Liver) వ్యాధులు ఉండటం.
- కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉన్నా, జన్యుపరమైన లోపాలు ఉన్నా జాగ్రత్త వహించాలి.
- మద్యపానం, రేడియేషన్ ప్రభావం కూడా ముప్పును పెంచుతాయి.
ముఖ్యమైన లక్షణాలు: వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
- ఛాతీ లేదా రొమ్ము భాగంలో నొప్పి లేని గడ్డలు ఏర్పడటం.
- రొమ్ము చర్మం రంగు మారడం లేదా ఎర్రగా వాపు రావడం.
- నిపుల్స్ లోపలికి ముడుచుకుపోవడం లేదా వాటి నుండి స్రావాలు రావడం.
- రొమ్ము చర్మంపై చిన్న చిన్న సొట్టలు పడటం.
- చంక భాగంలో వాపు లేదా గడ్డలు కనిపించడం.
భయం వద్దు.. చికిత్స ఉంది!
మగవారిలో క్యాన్సర్ నిర్ధారణ కోసం మమ్మోగ్రఫీ, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేస్తారు. గడ్డలోని కణాలను పరీక్షించడానికి బయాప్సీ నిర్వహిస్తారు. క్యాన్సర్ ఏ దశలో ఉంది అనే దానిపై చికిత్స ఆధారపడి ఉంటుంది. సర్జరీ ద్వారా గడ్డను తొలగించడం, కీమోథెరపీ, రేడియేషన్ లేదా హార్మోన్ థెరపీ వంటి పద్ధతుల ద్వారా ఈ వ్యాధిని నయం చేయవచ్చు. సకాలంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం చాలా సులభం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

