Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోషన్ మేకా 'ఏమో ఏమో ఇది' విడుదల వాయిదా

రోషన్ మేకా 'ఏమో ఏమో ఇది' విడుదల వాయిదా

వార్త 2 days ago

Emo Emo Idi Movie: రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం 'ఏమో ఏమో ఇది'. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ముందుగా అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.

అయితే, అదే రోజున సీనియర్ హీరో వెంకటేష్ నటించిన 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47' విడుదల కానుండటంతో 'ఏమో ఏమో ఇది' చిత్రబృందం తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Read Also : The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ..'ది ప్యారడైజ్'!

 Release of Roshan Meka’s ‘Emo Emo Idi’ postponed

Emo Emo Idi Movie: శైలేష్ కొలను ప్రకటన - శ్రీనిధి శెట్టి స్పందన

ఈ నిర్ణయాన్ని దర్శకుడు శైలేష్ కొలను సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. “నటుడు వెంకటేష్ గారు మా అందరి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. ఆయన నటించిన 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 30న విడుదలవుతున్నందున, మా 'ఏమో ఏమో ఇది' చిత్రాన్ని కొత్త తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం” అని పేర్కొన్నారు.

దర్శకుడి ప్రకటనపై ‘ఆదర్శ కుటుంబం’ కథానాయిక శ్రీనిధి శెట్టి స్పందిస్తూ.. ‘ఏమో ఏమో ఇది’ చిత్రబృందానికి ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు, ఈ సినిమా కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు.

అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47’ రాక

మరోవైపు, వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తొలుత అక్టోబర్ 2న, ఆ తర్వాత అక్టోబర్ 9కి వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు అక్టోబర్ 30న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. సీనియర్ హీరో సినిమాకి గౌరవం ఇస్తూ ‘ఏమో ఏమో ఇది’ టీమ్ తప్పుకోవడాన్ని సినీ ప్రియులు అభినందిస్తున్నారు.

విమర్శలు నా పనిని ఆపలేవు.. కాఫీ విత్ కరణ్ షోలో రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha