Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'రౌడీ జనార్ధన' స్పెషల్ సాంగ్ లో అనన్య?

'రౌడీ జనార్ధన' స్పెషల్ సాంగ్ లో అనన్య?

వార్త 3 weeks ago

Rowdy Janardhan : రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'రౌడీ జనార్ధన'.

ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారమవుతోంది. ఈ చిత్రంలో రాబోయే ఒక మాస్ మసాలా స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘లైగర్’ సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినప్పటికీ, స్క్రీన్‌పై విజయ్-అనన్య కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌ను ఒక అదిరిపోయే స్పెషల్ నంబర్ కోసం పునరావృతం చేయాలని చిత్ర మేకర్స్ భావిస్తున్నారు.

దిల్రాజు నిర్మాణంలో భారీ అంచనాలు.. అనన్యతో సంప్రదింపులు సక్సెస్?

ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర బృందం ఇప్పటికే అనన్య పాండేను సంప్రదించిందని, ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల సానుకూలంగా స్పందించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలకమైన పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. రవి కిరణ్ కోలా మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు విజయ్ దేవరకొండ వింటేజ్ యాక్షన్ స్టైల్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ తరుణంలో అనన్య పాండే స్పెషల్ అప్పీయరెన్స్ గనుక అధికారికంగా ఖరారైతే, ‘రౌడీ జనార్ధన’పై అంచనాలు మరియు బాలీవుడ్ మార్కెట్ క్రేజ్ మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ విశ్లేషకులు భావిస్తున్నారు.

బండ్ల గణేష్‌కు చుక్కెదురు.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha