Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RR-GT మ్యాచ్ టాస్ సమయంలో తీవ్ర గందరగోళం!

RR-GT మ్యాచ్ టాస్ సమయంలో తీవ్ర గందరగోళం!

వార్త 2 months ago

IPL 2026 - RR-GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అరుదైన, వింత సంఘటన చోటుచేసుకుంది.

మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించే టాస్ సమయంలో మైదానంలో తీవ్ర గందరగోళం నెలకొంది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కాయిన్ స్పిన్ చేయగా.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ‘హెడ్స్’ అని పిలిచాడు. కాయిన్ కింద పడినప్పుడు ‘టెయిల్స్’ వచ్చింది. అయితే, స్టేడియంలోని భారీ శబ్దాల కారణంగా పరాగ్ ఏం చెప్పాడో తనకు స్పష్టంగా వినిపించలేదని మ్యాచ్ రిఫరీ పేర్కొన్నారు. ఈ గందరగోళం కారణంగా టాస్‌ను రద్దు చేసి, మళ్లీ మొదటి నుండి కాయిన్ వేయాలని రిఫరీ ఆదేశించడంతో మ్యాచ్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Read Also : హార్దిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ వేటు?

గిల్ అసంతృప్తి.. రవిశాస్త్రి జోక్యంతో రెండోసారి టాస్!

రిఫరీ నిర్ణయంపై గుజరాత్ టైటాన్స్ సారథి శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పరాగ్ క్లియర్‌గా ‘హెడ్స్’ అని చెప్పడం తనకు వినిపించిందని, కాబట్టి ఫలితం ప్రకారం టాస్ తమకే దక్కాలని గిల్ రిఫరీతో వాదనకు దిగాడు. ఈ క్రమంలో మైదానంలో కాసేపు ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. చివరకు అక్కడే ఉన్న ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి కల్పించుకుని, వివాదానికి స్వస్తి పలికేందుకు మరోసారి టాస్ వేయడం మంచిదని గిల్‌కు నచ్చజెప్పారు. దాంతో గిల్ విధిలేక రెండోసారి కాయిన్ స్పిన్ చేశాడు. విశేషం ఏమిటంటే, ఈ రెండోసారి కూడా రియాన్ పరాగ్ ‘హెడ్స్’ అని పిలవగా.. ఈసారి కాయిన్ హెడ్స్ పడింది. దీంతో మొదటిసారి టాస్ గెలిచే అవకాశాన్ని కోల్పోయిన రాజస్థాన్, రెండో ప్రయత్నంలో టాస్ గెలుచుకోవడం విశేషం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జైస్వాల్ RRను వీడాలి అంటూ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha