Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జైస్వాల్ RRను వీడాలి అంటూ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు

జైస్వాల్ RRను వీడాలి అంటూ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు

వార్త 2 months ago

Ambati Rayudu Comments : ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజస్థాన్ రాయల్స్ (RR) స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడి వేరే ఫ్రాంచైజీకి మారడం అతడి కెరీర్‌కు ఎంతో మంచిదని రాయుడు అభిప్రాయపడ్డారు. యశస్వి జైస్వాల్ నిస్సందేహంగా ఒక అద్భుతమైన స్టార్ ఆటగాడని, అయితే ప్రస్తుత సీజన్లో అదే జట్టుకు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అతడిని మించిపోయేలా ప్రదర్శన చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇలా ప్రతి మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ తన దూకుడైన ఆటతీరుతో డామినేట్ చేస్తే, జైస్వాల్ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడు మరుగునపడిపోయే ప్రమాదం ఉందని రాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also : వైభవ్ సూర్యవంశీని అభినందించిన కావ్య మారన్.. వైరల్ వీడియో!

ముంబై ఇండియన్స్‌కు వెళ్తేనే బెటర్.. వైభవ్‌తో పోటీ పడలేరు!

రాజస్థాన్ రాయల్స్ జట్టులో వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనాల దృష్ట్యా, అతడితో పోటీ పడటం ఎవరికీ సాధ్యం కాదని అంబటి రాయుడు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే జైస్వాల్ ముంబై ఇండియన్స్ (MI) లాంటి వేరే బడా జట్టులోకి వెళ్తే అతడి నైపుణ్యానికి మరింత గుర్తింపు, స్వేచ్ఛ లభిస్తాయని సూచించారు. వైభవ్ సూర్యవంశీ లాంటి యువ హిట్టర్‌తో ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ బ్యాటర్ ఓపెనర్‌గా బరిలోకి దిగితేనే రాజస్థాన్ రాయల్స్ జట్టు సమతుల్యత మరింత బాగుంటుందని రాయుడు తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఒకే జట్టులో ఇద్దరు యువ అగ్రెసివ్ ఓపెనర్లు ఉండటం కంటే, జైస్వాల్ తన కెరీర్ ఎదుగుదల కోసం ఫ్రాంచైజీ మారడమే సరైన నిర్ణయమని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ట్విట్టర్ వేదికగా సచిన్ ప్రశంసలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha