Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RRR గన్మెన్లు, జనసేన నేతల మధ్య ఘర్షణ.. !!

RRR గన్మెన్లు, జనసేన నేతల మధ్య ఘర్షణ.. !!

వార్త 2 weeks ago

Guntur : గుంటూరు నగరంలో నిర్వహించిన స్ట్రీట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఊహించని విధంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (RRR) వ్యక్తిగత భద్రతా సిబ్బంది (గన్మెన్లు) మరియు జనసేన స్థానిక నాయకుల నడుమ చెలరేగిన వివాదం కొట్లాటకు దారితీసింది.

కార్యక్రమ సమయంలో రఘురామకృష్ణంరాజు గన్మెన్లు జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌ను పక్కకు తోసివేడంతో ఒక్కసారిగా పరిస్థితి విషమించింది. తమ నాయకుడిపై చేయిచేసుకోవడాన్ని నిరసిస్తూ జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ RRR భద్రతా సిబ్బందిపైకి తిరగబడటంతో ఇరువర్గాల మధ్య పరస్పర తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది.

శాంతపరచేందుకు ప్రయత్నించిన కేంద్ర మంత్రి పెమ్మసాని: పరిస్థితి అదుపుకాకపోవడంతో వెనుదిరింపు

సమావేశ ప్రాంగణంలో ఉద్రిక్తత పెరిగిపోవడంతో అక్కడే ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రంగంలోకి దిగి ఉభయ వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించినప్పటికీ, ఇరువర్గాల మధ్య తోపులాటలు మరియు ఆందోళన తగ్గకపోవడంతో వాతావరణం మరింత వేడెక్కింది. గందరగోళం సమసిపోకపోవడం, పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో చేసేదేమీ లేక కేంద్ర మంత్రి పెమ్మసాని అక్కడి నుండి నిష్క్రమించారు. కూటమి నేతలు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఈ ఘర్షణ ఘటన గుంటూరు స్థానిక రాజకీయాల్లో మరియు డిజిటల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కళ్యాణదుర్గంలో 53 మందికి ₹33.16 లక్షల చెక్కుల పంపిణీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha