Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదం.. తుపాకీ పేలి ఆర్‌ఐ సతీశ్ మృతి

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదం.. తుపాకీ పేలి ఆర్‌ఐ సతీశ్ మృతి

వార్త 2 weeks ago

Nizamabad Reserve Inspector: నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విధులు ముగించుకుని తన సర్వీస్ రివాల్వర్‌ను శుభ్రం చేసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) హెచ్‌.

సతీశ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయాన్నే జరిగిన ఈ ఊహించని ఘటనతో జిల్లా పోలీస్ విభాగం షాక్‌కు గురైంది.

Read Also : Human Trafficking Case: 9 మందికి జీవిత ఖైదు విధించిన ఎన్‌ఐఏ కోర్టు

 Accident at Police Headquarters: RI Satish dies after gun goes off.

Nizamabad Reserve Inspector: సర్వీస్ ఆయుధం శుభ్రం చేస్తుండగా జరిగిన ప్రమాదం

పోలీసు వర్గాలు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం… ఆర్‌ఐ సతీశ్ తన రోజువారీ విధులు పూర్తి చేసుకున్న అనంతరం హెడ్‌క్వార్టర్స్‌లో తన సర్వీస్‌ ఆయుధాన్ని శుభ్రం చేసే క్రమంలో ఈ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును సమీక్షించారు.

నిజాయతీగల అధికారిగా మంచి పేరు తెచ్చుకున్న ఆర్‌ఐ సతీశ్ అకస్మాత్తుగా మృతి చెందడంతో జిల్లా పోలీసు శాఖ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఒక్కసారిగా శోకసంద్రం అలముకోగా, ఆయన సహచర అధికారులు, సిబ్బంది సతీశ్ కుటుంబ సభ్యులకు తమ ఆత్మీయ సానుభూతిని తెలియజేశారు.

ఆనందంగా ఉంది..బాధగానూ ఉంది: యూట్యూబర్ వైష్ణవి వదిన సెల్ఫీ వీడియో

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha