Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.100 కోట్లతో రామ్ కొత్త చిత్రం

రూ.100 కోట్లతో రామ్ కొత్త చిత్రం

వార్త 1 week ago

RAPO23 : ఉస్తాద్ రామ్ పోతినేని కెరీర్‌లో 23వ చిత్రంగా రాబోతున్న 'RAPO23' సరికొత్త రికార్డులకు తెరలేపుతోంది. ఎప్పుడూ తన నటన, డాన్సులతో అలరించే రామ్, ఈ సినిమాతో సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఆయన స్వీయ దర్శకత్వంలో (Self-direction) ఈ చిత్రం రూపొందుతుండటం విశేషం. రామ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, తొలిసారి సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇదొక హై-వోల్టేజ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ (Psychological Action Thriller) కాబోతోందని, కథాంశం ఎవరూ ఊహించని విధంగా విభిన్నంగా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఈ ప్రయోగం రామ్ కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అగ్ర సాంకేతిక నిపుణులు.. వచ్చే నెల నుంచే షూటింగ్

భారీ తారాగణంతో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రి-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. చిత్రానికి అవసరమైన భారీ సెట్ వర్క్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయని టాక్. టెక్నికల్ పరంగా సినిమాను విజువల్ వండర్‌గా మార్చేందుకు గానూ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘తిరు’ (Thiru) ఈ ప్రాజెక్ట్‌లోకి రంగంలోకి దిగారు. ఆయన విజువల్స్ ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అన్ని అనుకూలిస్తే వచ్చే నెల నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా రామ్ తన సత్తా చాటడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది.

భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ హారర్ చిత్రం 'అబ్సెషన్'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha