Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ హారర్ చిత్రం 'అబ్సెషన్'

భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ హారర్ చిత్రం 'అబ్సెషన్'

వార్త 1 week ago

Obsession movie: హాలీవుడ్‌లో రూపొందిన ఒక చిన్న హారర్ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టిస్తోంది. 26 ఏళ్ల యువ దర్శకుడు కర్రీ బార్కర్ తెరకెక్కించిన 'అబ్సెషన్' చిత్రం భారతదేశంలో ఊహించని రీతిలో భారీ విజయాన్ని అందుకుంది.

ఈ లో-బడ్జెట్ సినిమా ఇప్పటివరకు మన దేశంలోనే రూ.79 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2026లో ఇండియాలో అతిపెద్ద హాలీవుడ్ హిట్‌గా అవతరించింది.

కేవలం రూ.7.5 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, భారీ అంచనాలతో మరియు భారీ బడ్జెట్‌తో విడుదలైన ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ (రూ.75 కోట్లు) వసూళ్లను సైతం అధిగమించి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల జాబితాలో ‘అబ్సెషన్’ ప్రస్తుతం 28వ స్థానంలో నిలిచింది. మరో కోటి రూపాయలు వసూలు చేస్తే చాలు.. హాలీవుడ్ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ (రూ.80 కోట్లు) రికార్డును కూడా ఇది బద్దలు కొట్టనుంది.

Read Also : Karthi Sardar 2 Movie: కార్తీ 'సర్దార్ 2' రిలీజ్ డేట్ వచ్చేసింది!

 Hollywood horror film ‘Obsession’ is creating a sensation in India.

Obsession movie: యూట్యూబర్ టు సెన్సేషనల్ డైరెక్టర్: కర్రీ బార్కర్ ఆశ్చర్యం

ఒకప్పుడు యూట్యూబర్‌గా ఉండి, ఇప్పుడు దర్శకుడిగా మారిన 26 ఏళ్ల కర్రీ బార్కర్ ఈ అద్భుత విజయంపై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారతదేశంలో తన హారర్ సినిమాకు ఈ స్థాయిలో బ్రహ్మరథం పడతారని తాను అస్సలు ఊహించలేదని అన్నారు. ఇండియన్ ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలోని భయానక సన్నివేశాలను రీక్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెడీ వీడియోలు చేయడం, ఫ్యాన్ ఆర్ట్ గీయడం చూసి తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు.

ఈ విజయం అల్గారిథమ్‌ల కంటే ఫిలిం మేకర్స్ ప్రతిభపై నమ్మకం పెంచడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు బార్కర్ పేర్కొన్నారు. యువ దర్శకులు మంచి కాంట్రాక్టులతో పాటు క్రియేటివ్ కంట్రోల్ సాధించుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 334 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.

సెప్టెంబర్ 4న థియేటర్లలోకి 'మిర్జాపూర్ ది మూవీ' రిలీజ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha