Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.1,167 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు నారా లోకేశ్‌ శంకుస్థాపన!

రూ.1,167 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు నారా లోకేశ్‌ శంకుస్థాపన!

వార్త 2 weeks ago

Nara Lokesh Mangalagiri Development: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (MTMC) పరిధిలో దశాబ్దాల నాటి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి రూ.1,167.50 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ (UGD) ప్రాజెక్టు పనులకు తాడేపల్లిలో శంకుస్థాపన చేశారు.

Read Also:Nara Lokesh: కూటమి విజయాలను ప్రతి ఇంటికీ చేరవేయాలి..టీడీపీ శ్రేణులకు లోకేశ్ పిలుపు

రెండు దశల్లో హైబ్రిడ్ యాన్యుటీ నిర్మాణం

 Tadepalli Underground Drainage Project Scheme

ఈ బృహత్తర ప్రాజెక్టును అత్యంత ఆధునిక విధానంలో, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (Hybrid Annuity Model – HAM) ద్వారా రెండు ఫేజ్‌లలో పూర్తి చేయనున్నారు. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.1,167.50 కోట్లు కాగా, మొదటి దశ (Phase-1) పనులకు రూ.604.32 కోట్లు, రెండో దశ (Phase-2) పనులకు రూ.563.18 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాజధాని కోర్ పరిధిలోకి వచ్చే నవులూరు, యర్రబాలెం, బేతపూడి, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి మినహా ఎంటీఎంసీ (MTMC) పరిధిలోని మిగిలిన అన్ని పట్టణ, విలీన ప్రాంతాలకు ఈ భూగర్భ డ్రైనేజీ సౌకర్యం కల్పించనున్నారు.

Nara Lokesh Mangalagiri Development: 531 కిలోమీటర్ల పైప్‌లైన్ - 20 శుద్ధి కేంద్రాలు

పట్టణ ప్రజారోగ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వీలుగా ఈ ప్రాజెక్టులో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా మొత్తం 531 కిలోమీటర్ల పొడవైన ప్రధాన మురుగునీటి పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను నిర్మించనున్నారు. (ఫేజ్-1 లో 300 కి.మీ., ఫేజ్-2 లో 231 కి.మీ.). రోజుకు 47.51 మిలియన్ లీటర్ల (MLD) మురుగునీటిని శుద్ధి చేసేలా మొత్తం 20 మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 14 ఎస్టీపీలను అత్యంత అధునాతనమైన ఎస్‌బీఆర్ (SBR – Sequential Batch Reactor) సాంకేతికతతో, మరో 6 కేంద్రాలను ఎఫ్‌బీ టెక్ ప్యాకేజ్డ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లుగా నిర్మిస్తారు. వీటితో పాటు మురుగునీటి సరఫరాను క్రమబద్ధీకరించడానికి 18 లిఫ్ట్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. “మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటాం. ఈ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుతో పాటు త్వరలోనే తాగునీరు, అంతర్గత రహదారుల పనులను పూర్తి చేసి మంగళగిరిని దేశంలోనే నంబర్ వన్ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం.”

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పీఈసెట్ ఫలితాలు విడుదల చేసిన నారా లోకేశ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha