Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
ప్రతి గడపకు అభివృద్ధి, సంక్షేమ సందేశం చేరేలా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో లోకేశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు.
Read also: Vijayawada Rainbow Hospital: విజయవాడ రెయిన్ బో హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం.. అసలేం జరిగింది?
45 రోజుల ప్రజా ప్రచార కార్యక్రమం
ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు 45 రోజుల పాటు విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఎంపీల నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు అందరూ ప్రజల వద్దకు వెళ్లాలని ఆయన సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలు, బుక్‌లెట్లు అందించాలని ఆయన తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగాలని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను లోకేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
'తల్లికి వందనం', 'దీపం-2' కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, రూ. 4 వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఆటో డ్రైవర్ల సంక్షేమం, 'అన్నదాత సుఖీభవ' వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గతంలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం వల్ల నష్టం జరిగిందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రత్యర్థుల ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Nara Lokesh: ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా అప్రమత్తత
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని లోకేశ్ సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా ప్రతి ఓటును సరిచూసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు బీఎల్ఏలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని, సమస్యలు ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

