Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.2,000 దాటితే పెట్రోల్ పంపుల్లో UPI బంద్?

రూ.2,000 దాటితే పెట్రోల్ పంపుల్లో UPI బంద్?

వార్త 2 weeks ago

Petrol Pump UPI: యూపీఐ చెల్లింపులపై కొత్తగా అమల్లోకి రానున్న Merchant Discount Rate (MDR)పై పెట్రోల్ పంప్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో రూ.2,000కు మించిన ఇంధన కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులను నిలిపివేయాలని పెట్రోల్ పంప్ డీలర్లు నిర్ణయించారు. అక్టోబర్ 15 నుంచి కొత్త MDR విధానం అమల్లోకి రానుండగా.. మధ్యప్రదేశ్‌లోని దాదాపు 4,700 పెట్రోల్ పంపులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.

Read Also :Gold Rate Today: రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే

రూ.2,000 దాటితే UPIకి నో?

మధ్యప్రదేశ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. రూ.2,000కు మించిన ఇంధన బిల్లులకు అక్టోబర్ 15/16 నుంచి యూపీఐ చెల్లింపులను స్వీకరించకుండా నగదు చెల్లింపులకే పరిమితం చేయాలని నిర్ణయించారు. అయితే రూ.2,000 వరకు డిజిటల్ చెల్లింపులు కొనసాగుతాయి. ఇది ప్రస్తుతం మధ్యప్రదేశ్ డీలర్ల నిర్ణయం మాత్రమే. దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపులు రూ.2,000కు పైగా UPIని నిలిపివేస్తాయని చెప్పలేం.

పెట్రోల్ పంపులకు MDR ఎంత?

కొత్త UPI MDR విధానం ప్రకారం అక్టోబర్ 15, 2026 నుంచి రూ.2,000కు మించిన కొన్ని Person-to-Merchant (P2M) లావాదేవీలపై MDR వర్తించనుంది. సాధారణ కేటగిరీలో 0.4 శాతం MDR ఉండగా.. ఇంధనం, రైల్వే, టెలికాం వంటి నిర్దిష్ట రంగాలకు రూ.2,000కు మించిన లావాదేవీలపై ఫ్లాట్ రూ.5 MDR విధానం ఉంటుంది. ఈ MDRను కస్టమర్లపై నేరుగా బదిలీ చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే రూ.5 MDRను పెట్రోల్ కొనుగోలుదారుడి నుంచి అదనంగా వసూలు చేయాల్సిన నిబంధన లేదు.

డీలర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

పెట్రోల్ పంపుల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని, మరోవైపు ఇంధన విక్రయాలపై తమ మార్జిన్లు పరిమితంగానే ఉన్నాయని డీలర్లు చెబుతున్నారు. ప్రతి రూ.2,000కు పైబడిన UPI లావాదేవీపై MDR భారం పడటం వల్ల తమ నిర్వహణ ఖర్చులు మరింత పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్‌తో పాటు All India Petroleum Dealers Association (AIPDA) కూడా పెట్రోల్ పంపులను MDR నుంచి పూర్తిగా మినహాయించాలని కేంద్రాన్ని కోరింది.

4,700 పెట్రోల్ పంపులపై ప్రభావం

మధ్యప్రదేశ్‌లో దాదాపు 4,700 పెట్రోల్ పంపులు ఈ నిర్ణయం పరిధిలోకి వస్తాయని డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. రూ.2,000కు మించిన ఇంధన కొనుగోళ్లకు UPI అందుబాటులో లేకపోతే.. కార్లు, ట్రక్కులు, క్యాబ్‌లు, వాణిజ్య వాహనాలకు పెద్ద మొత్తంలో ఇంధనం నింపుకునే వినియోగదారులు నగదును ఉపయోగించాల్సి రావచ్చు.

ఇతర రాష్ట్రాల్లోనూ ఆందోళన

MDRపై ఇతర ప్రాంతాల పెట్రోల్ పంప్ డీలర్లలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలోని డీలర్లు కూడా ఈ అంశంపై చర్చించేందుకు సెప్టెంబర్ 27న సమావేశం నిర్వహించనున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్ పంపులు UPI చెల్లింపులను నిలిపివేస్తాయనే నిర్ణయం ఇప్పటివరకు లేదు. ఆయా రాష్ట్రాల డీలర్ సంఘాల నిర్ణయాలపై ఇది ఆధారపడి ఉంటుంది.

Petrol Pump UPI: కస్టమర్లపై నేరుగా ఛార్జీ ఉండదు

కొత్త MDR విధానంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఛార్జీ మర్చంట్‌పై ఉండే చెల్లింపు ఖర్చు, కస్టమర్ నుంచి UPI వినియోగ రుసుముగా వసూలు చేయడానికి కాదు. బ్యాంకులు, UPI యాప్‌లు MDR భారాన్ని కస్టమర్లపై బదిలీ చేయకుండా చూడాలని ప్రభుత్వం సూచించింది. దీంతో పెట్రోల్ పంపుల వద్ద రూ.2,000కు పైగా UPI చెల్లింపుల భవిష్యత్తు.. డీలర్లు MDRను భరించాలా లేదా అనే అంశంతో ముడిపడి ఉంది. మధ్యప్రదేశ్‌లో డీలర్లు తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే, అధిక విలువైన ఇంధన కొనుగోళ్లకు నగదు చెల్లింపుల అవసరం ఏర్పడే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో 'న్యూ ఐడెంటిటీ' ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha