PM Kisan:దేశవ్యాప్తంగా అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM Kisan పథకంలో 24వ విడత నిధుల విడుదలకు పూర్తి ఏర్పాట్లు జరిగాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 30న ఈ పథకం కింద నిధులను నేరుగా విడుదల చేయనున్నారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.18,680 కోట్లకు పైగా జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.2,000 చొప్పున నేరుగా డీబీటీ విధానంలో అందుతాయి. గుజరాత్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి కార్యక్రమంలో ప్రధాని ఈ నిధులను బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 23 విడతల ద్వారా రూ.4.47 లక్షల కోట్లకు పైగా నిధులు పంపిణీ చేశారు. వ్యవసాయ పెట్టుబడులు, విత్తనాలు అలాగే ఎరువుల కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. తమ పేరు మీద సాగు భూమి ఉన్న అర్హులైన రైతులు మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందడానికి పూర్తి అర్హత కలిగి ఉంటారు.
1000 Rupee Note News: త్వరలో రూ.1,000 నోట్లు రాబోతున్నాయా?
These are mandatory for the Rs 2,000 to be credited to your accounts!
తప్పనిసరిగా ఇ-కేవైసీ పూర్తి చేయండి.. ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకోండి!
పీఎం కిసాన్ లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ తప్పుకుండా ఇ-కేవైసీ ధృవీకరణ పూర్తి చేసుకోవడం అత్యంత కీలకమైన అంశం. కాబట్టి రూ.2,000 పొందాలనుకునే రైతులు తమ ఇ-కేవైసీ స్థితిని అధికారిక పోర్టల్ ద్వారా ముందుగానే తనిఖీ చేసుకోవాలి. ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం అలాగే భూమి రికార్డుల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోలేని వారు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి బయోమెట్రిక్ ద్వారా సహాయం పొందవచ్చు. రైతులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి చెల్లింపు వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ చెల్లింపు నిలిచిపోయినట్లు కనిపిస్తే అందులో పేర్కొన్న కారణాన్ని పరిశీలించి తక్షణమే అవసరమైన మార్పులు చేసుకోవాలి. ధృవీకరణ ప్రక్రియ పూర్తి కాకపోతే రాబోయే విడత నగదు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ముందే జాగ్రత్త పడాలి.
PM Kisan:డబ్బులు పడకపోతే ఏం చేయాలి?.. రైతులు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు!
అక్టోబర్ 30న విడుదలయ్యే నిధులు ఒకవేళ మీ ఖాతాలో జమ కాకపోతే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి లబ్ధిదారుడి స్థితిని తనిఖీ చేసి సమస్య ఏమిటో పరిశీలించాలి. ఇ-కేవైసీ పూర్తయిందా లేదా, బ్యాంకు వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే అంశాలను పూర్తిగా చెక్ చేసుకోవాలి. ధృవీకరణ ఇంకా పెండింగ్‌లో ఉంటే పోర్టల్‌లో సూచించిన విధంగా వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. అవసరమైతే మీ ప్రాంతంలోని స్థానిక వ్యవసాయ అధికారులను లేదా సిబ్బందిని సంప్రదించి సరైన మార్గదర్శకత్వం పొందవచ్చు. చెల్లింపులలో ఏదైనా చిన్న ఆలస్యం జరిగినంత మాత్రాన రైతు పథకానికి శాశ్వతంగా అనర్హుడయ్యాడని భావించాల్సిన పనిలేదు. సరైన పత్రాలు సమర్పిస్తే తదుపరి విడతలో మీ బకాయిలు కూడా కలిపి ఖాతాలో జమ అవుతాయి.
Epaper: epaper.vaartha.com

