Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ అబద్ధాలు చెప్తోంది: హరీశ్ రావు

రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ అబద్ధాలు చెప్తోంది: హరీశ్ రావు

వార్త 3 weeks ago

Harish Rao comments: తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మధ్యే లెక్కల్లో అస్సలు పొంతన లేదని ఆయన ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన 'ఎస్ఐఆర్' (SIR) పై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న హరీశ్ రావు, ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శల శరపరంపర కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,77,058 కోట్లు మాత్రమే అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా తనకు ఒక లేఖ రాశారని హరీశ్ రావు ఈ సందర్భంగా బహిర్గతం చేశారు. అధికారికంగా మంత్రి ఇచ్చిన సమాచారంలో అప్పుల వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.

Read Also: Warangal couple death: ఘట్‌కేసర్ పరిధిలో రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!

 Congress is spreading lies about the state’s debt: Harish Rao

Harish Rao comments: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క వేరు

అయితే ఇదే అప్పుల అంశంపై నాలుగు నెలల క్రితం అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను హరీశ్ రావు ప్రస్తావించారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం చేసిన అప్పు ఏకంగా రూ. 3,45,294 కోట్లు అని సభకు తెలిపారని గుర్తుచేశారు. ఒకే క్యాబినెట్‌లో ఉన్న ముఖ్యమంత్రి ఒక లెక్క, అందులోని మరో మంత్రి ఇంకొక లెక్క చెప్పడం ఏంటని ఆయన నిలదీశారు. ఒకే ప్రభుత్వం నుంచి వస్తున్న ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రజల్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నాయని హరీశ్ రావు మండిపడ్డారు. అప్పుల విషయంలో కాంగ్రెస్ నేతలు కావాలనే అబద్ధాలు చెబుతూ రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారని ఆరోపించారు. ఈ రెండు లెక్కల్లో అసలైన నిజమైన లెక్క ఏదో ప్రభుత్వం తక్షణమే స్పష్టం చేయాలని, శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు నిజాలు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

Epaper: epaper.vaartha.com

తృటిలో తప్పిన ప్రమాదం.. పెట్రోల్ బంక్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha