Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.72 లక్షల బకాయిలు చెల్లించాలన్న నోటీసు

రూ.72 లక్షల బకాయిలు చెల్లించాలన్న నోటీసు

వార్త 2 months ago

సెలూన్ షాపు ఓనర్‌కు భారీ జీఎస్టీ నోటీసు

GST notice barber : పొట్టకూటికోసం చిన్న సెలూన్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తికి భారీ జీఎస్టీ షాక్ తగిలింది.

విజయవాడలోని పంజా సెంటర్‌కు చెందిన పైడాడ శ్రీనివాసరావు అనే వ్యక్తికి రూ.72 లక్షల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.

అకస్మాత్తుగా బ్యాంక్ ఖాతా హోల్డ్

ఇటీవల ఆయన బ్యాంక్ ఖాతా అకస్మాత్తుగా హోల్డ్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్‌కు వెళ్లి విచారించగా, జీఎస్టీ బకాయిల కారణంగా ఖాతా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బకాయిలు చెల్లించిన తర్వాతే ఖాతా తిరిగి ప్రారంభిస్తామని బ్యాంక్ అధికారులు చెప్పడంతో బాధితుడు ఆందోళన చెందుతున్నాడు.

Read Also: Nellore: ప్రత్యేక అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించండి: కలెక్టర్

 GST notice barber

ఆధార్, పాన్ దుర్వినియోగం అనుమానం

జీఎస్టీ రికార్డుల ప్రకారం విశాఖపట్నంలో శ్రీనివాసరావు పేరుతో స్క్రాప్ ఐరన్ వ్యాపారం జరిగినట్లు నమోదై ఉంది. అయితే తనకు అలాంటి వ్యాపారం లేదని, కనీసం విశాఖకు వెళ్లిన సందర్భం కూడా లేదని బాధితుడు చెబుతున్నాడు. అతని ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ రికార్డులు సృష్టించి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తగ్గేదేలే అంటున్న ట్రంప్ మరోసారి భారీగా పెంచిన టారిఫ్ లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha