Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రత్యేక అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించండి: కలెక్టర్

ప్రత్యేక అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించండి: కలెక్టర్

వార్త 2 months ago

Nellore: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల పర్యవేక్షణకు నూతనంగా నియమితులైన ప్రత్యేక అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు.

కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో మండల, అర్బన్ స్థాయి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ప్రత్యేక అధికారుల సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.

Read Also: CM Chandrababu : ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి-సీఎం చంద్రబాబు ఆదేశాలు

Nellore: ప్రజలకు అందే సేవలే కొలమానం

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అందించే సేవలు సమర్థవంతంగా అందుతున్నాయో, లేదో ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గిరిజనులకు ఆధార్ కార్డులు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసి, ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
అన్ని ఆధార్ కిట్లు యాక్టివ్‌గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలను తరచూ తనిఖీ చేసి, ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత వేగవంతం చేయాలని సూచించారు.వాట్సాప్ గవర్నెన్స్ యాప్ వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను నిర్దిష్ట కాలపట్టికలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో డిప్యూటీ సీఈఓ మోహన్ రావు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులు శ్రీలక్ష్మి, హిమబిందు, మండలాలు, మున్సిపాలిటీల ప్రత్యేక అధికారులు, కోఆర్డినేటర్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఏపీ ఎన్నికల ఫలితాలపై బొత్స మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha