Price Shock : ఒక కుటుంబం ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయడానికి భారీ ఆర్థిక గణాంకాలు అవసరం లేదు. ఆ కుటుంబం నెలకు తెచ్చే సరుకుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే చాలు.
బియ్యం, పప్పు, వంటనూనె, పంచ దార, గోధుమలు, కూరగాయలు, పాలు, ఇంధనం, వీటి ధరలు ఎంత పెరిగాయి? అనే ప్రశ్నలకు సమాధా నం వెతికితే సామాన్యుడి ఆర్ధిక స్థితి ఏ దిశగా వెళ్తుందో స్పష్టంగా అర్థమ వుతుంది. ప్రస్తుతం దేశంలో అదే జరుగుతోంది. ఆదాయా లు పెరిగే వేగం కంటే నిత్యావసరాల ధరలు పెరుగుతున్న వేగం ఎక్కువగా ఉండటంతో కోట్లాది కుటుంబాల నెలవారీ బడ్జెట్ అస్తవ్యస్తమవుతోంది. ధరల పెరుగుదల ఇప్పుడు కేవలం మార్కెట్లో కనిపించే సంఖ్య కాదు.. అది ప్రతి ఇంటి వంటగదిలో కనిపిస్తున్న మంట. గత ఫిబ్రవరి 28 నుంచి ఆగస్టు 3 మధ్య కేవలం ఐదు నెలల వ్యవధిలోనే వంటింట్లో నిత్యం ఉపయోగించే అనేక సరుకుల ధరలు 5 శాతం నుంచి 40శాతం వరకు పెరిగినట్టు మార్కెట్ గణాం కాలు చెబుతున్నాయి. ప్రాథమిక ఆహార వస్తువుల ధరలు పెరగడం అంటే పేద, మధ్యతరగతి కుటుంబాలపై నేరుగా అదనపు భారం పడటమే. సంపాదనలో గణనీయమైన భాగం ఆహారం, ఇంధనం, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలకే వెచ్చించాల్సి వస్తే పొదుపు ఎలా సాధ్యం? భవిష్యత్తు కోసం పెట్టుబడి ఎలా పెట్టగలరు? పిల్లల విద్య, ఆరోగ్యం వంటి అవసరాలకు ఎలా కేటాయించగలరు?
Read Also : Gold price today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు
Price Shock
Price Shock : ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిణామాలు
ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధాలు, వాతా వరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, ఇంధన ధరలు, దిగుమతులపై ఆధారపడటం వంటి అనేక కారణాలు ఉన్నా యనడంలో సందేహంలేదు. ప్రపంచ ఆర్ధికవ్యవస్థ పరస్పర ఆధారితంగా మారిననేపథ్యంలో ఒక దేశంలో జరిగేయుద్ధం, మరో దేశంలో ఏర్పడే వాతావరణ సంక్షోభం కూడా మన వంటింటిపై ప్రభావం చూపుతోంది. యుద్ధాలు ప్రభుత్వాల చేతుల్లో ఉండకపోవచ్చు. వాతావరణాన్ని కూడా నియంత్రిం చలేం. అంతర్జాతీయ మార్కెట్లను పూర్తిగా శాసించలేం. కానీ వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి దేశీయమార్కె ట్ను రక్షించే విధానాలను రూపొందించడం మాత్రం ప్రభు త్వాల బాధ్యత. ఆహారనిల్వలను సమర్థంగా నిర్వహించడం, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, రైతులను ప్రోత్స హించడం, దిగుమతులపై అధిక ఆధారపడకుందావ్యూహాలు రూపొందించడం, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను అరి కట్టడం వంటి చర్యలు ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. అందుకే ధరలు పెరిగిన ప్రతిసారీ అంతర్జాతీయ పరిస్థితు లను కారణంగా చూపడం కంటే ప్రభుత్వం ముందస్తుగా ఏం చేసింది? ఇంకా ఏం చేయాలి? అనే ప్రశ్నలకు సమా ధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో కోట్లాది కుటుంబాలకు బియ్యం కేవలం ఒక ఆహార పదార్థం కాదు. అది వారి రోజువారీ జీవితంలో అత్యంత ప్రాథమిక అవ సరం. అలాంటి బియ్యం ధరలు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే పరిణామం,
తాత్కాలిక సమస్య గా చూడటం ప్రమాదకరం
దేశంలో 2025-26వంట సంవత్సరంలో వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంటుందని ప్రభుత్వ అంచనాలున్నప్పటికీ, మార్కెట్లో బియ్యం లభ్య త తగ్గి ధరలు పెరగడం విరుద్ధమైన పరిస్థితిని సూచిస్తోం ది. ఉత్పత్తి ఉన్నప్పటికీ వినియోగదారుడికి ధర ఎందుకు తగ్గడం లేదు? రైతు నుంచి వినియోగదారుడి వరకు ఉన్న సరఫరా గొలుసులో ఎక్కడ సమస్య ఉంది? నిల్వలు ఎలా ఉన్నాయి? మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? మధ్య వర్తుల పాత్ర ఎంత? ప్రభుత్వం వద్ద ఉన్న బఫర్ స్టాక్స్ పరిస్థితి ఏమిటి? రైతుకు తగిన ధరరావాలి. అదే సమ యంలో వినియోగదారుడిపై అనవసరమైన భారం పడకూ డదు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే సమ ర్ధవంతమైన వ్యవసాయ, ఆహార విధానానికి కొలమానం. నిత్యావసర వస్తువుల ధరల్లో వంటనూనెది ప్రత్యేక స్థానం. భారతదేశం తన దేశీయ అవసరాల్లో గణనీయమైన భాగం కోసం దిగుమతులపై ఆధారపడుతోంది. అంతర్జాతీయమార్కె ట్లలో ధరలు పెరిగినా, యుద్ధాలు జరిగినా, సముద్ర రవా ణాకు అంతరాయం ఏర్పడినా దానిప్రభావం నేరుగా భారతీ య వినియోగదారుడిపై పడుతుంది. ఇది తాత్కాలిక సమస్య గా చూడటం ప్రమాదకరం.
Price Shock
చివరికి భారం వినియోగదారుడిపైనే..
దేశీయంగా నూనెగింజల ఉత్ప త్తిని పెంచే దీర్ఘకాలిక వ్యూహం అవసరం. రైతులకు మెరు గైన విత్తనాలు, సాగు సాంకేతికత, మార్కెట్ హామీ, గిట్టు బాటు ధర కల్పించకుండా దిగుమతులపై ఆధారపడటంకొన సాగిస్తే ప్రతి అంతర్జాతీయ సంక్షోభం మన వంటింటిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. పంచదార ధరలు 8 నుంచి 15 శాతం వరకు పెరగడం మరో ఆందోళనకర పరిణామం, హోల్సేల్ మారె ట్లో క్వింటాల్కు గణనీయమైన పెరుగు దల నమోదవుతుండగా, దేశంలోని ప్రధాన నగరాల్లోరిటైల్ ధరలు కూడా పైకి కదులుతున్నాయి. సరఫరా తగినంతగా లేకపోతే ధరలు మరింత ఎగిసే అవకాశం ఉంటుంది. వాతా వరణ మార్పులు వ్యవసాయ రంగానికి కొత్త సవాళ్లు విసు రుతున్నాయి. ఎల్సినో వంటి వాతావరణ పరిస్థితులు వర్ష పాతంపై ప్రభావం చూపితే పంటల సాగు, ఉ త్పత్తి రెండూ దెబ్బతింటాయి. ఇప్పటికే ఖరీఫ్ పంట విస్తీర్ణం గత ఏడాది తో పోలిస్తే తగ్గినట్టు మార్కెట్ వర్గాల అంచనాలు చెబుతు న్నాయి. సాగు తగ్గితే ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గితే సరఫరా తగ్గుతుంది. సరఫరా తగ్గితే ధర పెరుగుతుంది. ధర పెరిగితే చివరికి భారం వినియోగదారుడిపైనే పడుతుం ది. ధరలు పెరిగిన తర్వాత స్పందించడం కంటే ధరలు పెరగడానికి దారితీసే పరిస్థితులను ముందుగానే గుర్తించడం ప్రభుత్వాల బాధ్యత. దేశ ఆర్థిక వ్యవస్థకు నిజమైన అద్దం స్టాక్ మార్కెట్ సూచీలు కాదు. సామాన్యుడి వంటగది. ఆ వంటగదిలో మంట అదుపులో ఉ న్నప్పుడే దేశ ఆర్ధిక ప్రగతి నిజమైన అర్థాన్ని సంతరించుకుంటుంది.
-జీ. శ్రీలత
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

