Tomato Rate in Hyderabad: మొన్నటివరకు కిలో రూ.20 ధర మార్కెట్లో పలికిన టమాట ఇప్పుడు భారీగా పెరిగింది. వంటగదిలో కూర ఏదైనా సరే టమాటా లేనిదే ముద్ద దిగని సామాన్యుడికి ఇప్పుడు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
మొన్నటిదాకా పాతా ళంలో ఉన్న టమాటా రేటు ఇప్పుడు ఒక్కసారిగా డబుల్ అయి కూర్చుంది. హైదరాబాద్లోని ప్రధాన మార్కెట్లలో ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.40 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. దీంతో మార్కెట్కు వెళ్తున్న వినియోగదారులు టమాటా ధర విని అవాక్కవుతున్నారు. కిలో కొనేవాళ్లంతా ఇప్పుడు అరకిలో, పావుకిలో తో సరిపెట్టుకుంటున్నారు. మార్కెట్లో టమాటాలకు డిమాండ్ బాగానే ఉన్నా, దానికి తగినట్టుగా సప్లై లేకపోవడమే ఈ ధరల మంటకు అసలు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. గత నెలలో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో పెట్టుబడులు కూడా రాక నష్టపోయిన రైతులు చాలా చోట్ల పంట కోయడమే ఆపేశారు. కొత్తగా సాగు చేయడం కూడా తగ్గించేశారు.
దీని ప్రభావం ఇప్పుడు మార్కెట్పై పడింది. సరుకు రాక ఒక్కసారిగా ధరలు పైపైకి దూసుకెళ్లాయి. ప్రస్తుతానికి మార్కెట్లోకి వచ్చే టమాటా లారీల సంఖ్య బాగా తగ్గిపోవడంతో ఈ డిమాండ్ ఏర్పడింది. రానున్న రోజుల్లో కూడా సరఫరా ఇలాగే తక్కువగా ఉంటే టమాటా(Tomato Rate in Hyderabad) ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

