Social Media Influencer Manshi: సోషల్ మీడియాలో వేలాది మందిని ఆకట్టుకుంటూ భార్యాభర్తలుగా కలిసి రీల్స్ చేసిన ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ జీవితం అనుమానాస్పద స్థితిలో ముగిసింది.
పెళ్లయిన రెండేళ్లకే సదరు మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ అత్తింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అదనపు కట్నం కోసమే తమ కూతురిని వేధించి చంపేశారంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
Read Also: Kurnool crime: కన్నకొడుకును హత్య చేసిన తల్లి, కేసు వెలుగులోకి రాగానే అనుమానాస్పద మృతి
Influencer dies just two years after marriage.. Was dowry harassment the reason?
Social Media Influencer Manshi: రీల్స్ లో జోడీ.. రియల్ లైఫ్ లో వేధింపులు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌కు చెందిన మాన్షికి, లఖ్‌నవూకు చెందిన సాగర్ రాజ్‌పుత్‌కు 2024లో వివాహమైంది. పెళ్లయిన తర్వాత వీరిద్దరూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా భర్త సాగర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కలిసి క్రమం తప్పకుండా వీడియోలు, రీల్స్ చేస్తూ ఉండేవారు. పెళ్లి సమయంలో మాన్షి తల్లిదండ్రులు వరకట్నం కింద రూ. 7 లక్షల నగదుతో పాటు, ఇంటి సామాన్లు, ఇతర ఖరీదైన బహుమతులను అత్తింటికి ఇచ్చారు.
కారు కావాలంటూ టార్చర్.. ఆత్మహత్య కాదు హత్యే!
పెళ్లైన కొంతకాలం వీరి కాపురం బాగానే సాగినప్పటికీ, అదనపు కట్నం రూపంలో వేధింపులు మొదలయ్యాయి. మాన్షి అనుమానాస్పద మృతిపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు పేర్కొన్నారు. పెళ్లిలో రూ. 7 లక్షల నగదు, సామాన్లు ఇచ్చినా వారికి సంతృప్తి కలగలేదు. తక్కువ కట్నం తెచ్చిందని నా కూతురిని మానసికంగా, శారీరకంగా వేధించేవారు. అదనంగా కారు కావాలంటూ నిరంతరం హింసించేవారు. ఈ వేధింపుల గురించి చెప్తూ మాన్షి మా వద్ద చాలాసార్లు ఏడ్చింది. అత్తింటి వారికి నచ్చజెప్పేందుకు మేము పలుమార్లు లఖ్‌నవూ కూడా వెళ్లాం. శనివారం మా కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేశారు. కానీ ఇది ముమ్మాటికీ హత్యే. నా కూతురిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు.”
భర్తతో పాటు ఆరుగురిపై కేసు నమోదు
కూతురి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణమే భర్త సాగర్ రాజ్‌పుత్‌తో పాటు అతని కుటుంబానికి చెందిన మరో ఐదుగురిపై వరకట్న వేధింపులు, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, కేసు దర్యాప్తు వేగవంతం చేశామని పోలీసులు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

