Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సాతాన్: ది డార్క్' మూవీ రివ్యూ

'సాతాన్: ది డార్క్' మూవీ రివ్యూ

వార్త 2 weeks ago

Saataan The Dark movie: ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై హారర్ థ్రిల్లర్ జోనర్ సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే విభిన్నమైన హారర్ కథలను డిజిటల్ స్క్రీన్‌పైకి తెచ్చేందుకు ఓటీటీ సంస్థలు ఎప్పుడూ పోటీపడుతుంటాయి.

అలా ఇటీవల కాలంలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించిన లేటెస్ట్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రమే ‘సాతాన్: ది డార్క్’. తమిళంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో విడుదలైంది. కాగా, ఈ నెల 8వ తేదీ నుంచి ‘అమెజాన్ ప్రైమ్’లో, అలాగే ఈ నెల 20వ తేదీ నుంచి ‘ఆహా తమిళ్’ లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు భయపెట్టిందో రివ్యూలో చూద్దాం.

Read Also : EPIC Priyasakhi Song: ఆనంద్ దేవరకొండ 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' నుంచి మెలోడీ పాట విడుదల

 ‘Satan: The Dark’ Movie Review

కథ

Saataan The Dark movie: ఒక కొండ ప్రాంతాన్ని ఆనుకుని ఉండే పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అక్కడ అలీషా (ఐరా) తన తల్లి మెర్సిలిన్ (మోనా బెద్రే), చెల్లెలితో కలిసి నివసిస్తూ ఉంటుంది. అలీషా చిన్నతనంలో తమ ఇంటి చీకటి గది నుంచి వింత అరుపులు, కేకలు వింటూ పెరుగుతుంది. ఆ గదిలో ఉన్నది ‘విక్టోరియా’ అనే విషయం ఆమె మనసులో బలంగా ముద్రపడిపోతుంది. అలీషా స్థానిక ‘సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్’ లో 12వ తరగతి చదువుతుండగా, అదే క్లాస్‌కు చెందిన సాగర్ (ఫెడ్రిక్ జాన్) ఆమెను ప్రేమిస్తుంటాడు.

ఇలా సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి ఒక క్షుద్రశక్తి ప్రవేశిస్తుంది. కొంతకాలంగా తల్లి మెర్సిలిన్ ప్రవర్తన విచిత్రంగా మారుతుంది. ఏదో దుష్టశక్తి ఆవహించినట్లు ఆమె తానేం చేస్తుందో తెలియని స్థితికి వెళ్ళిపోతుంది. కన్నతల్లి విపరీత ధోరణి ఆ ఇద్దరు కూతుళ్లను భయభ్రాంతులకు గురిచేస్తుంది. తనను తాను గాయపరచుకోకుండా తల్లిని కాపాడుకోవడానికి అలీషా చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో ఆమె పడే ఇబ్బందుల చుట్టూ కథ తిరుగుతుంది. హాస్పిటల్ పాలవుతున్న అలీషాను చూసి ఆమె లవర్ సాగర్ రంగంలోకి దిగుతాడు. తన స్నేహితుడు మురళితో కలిసి అలీషా ఇంటికి వెళ్లిన సాగర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ సాతాన్ బారి నుంచి అలీషా కుటుంబాన్ని అతను ఎలా కాపాడాడు? అనేది మిగతా సినిమా. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో దెయ్యం పట్టిన కూతురిని తల్లి కాపాడుకోవడం చూస్తాం. కానీ ఇందులో దుష్టశక్తి బారి నుంచి తల్లిని రక్షించుకోవడానికి కూతురు తపించిపోవడం అనే పాయింట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది.

ఎలా ఉందంటే?

సినిమాను 16వ శతాబ్దంతో ముడిపెట్టి ప్రారంభించిన తీరు ఉత్కంఠను రేకెత్తించినప్పటికీ, ఆ తర్వాత వచ్చే సీన్లు చాలా రొటీన్ హారర్ ఫార్మాట్‌లోకి వెళ్ళిపోతాయి. కాలేజ్, చర్చ్, కాకుల దాడి వంటి ఎలిమెంట్స్‌తో భయపెట్టే ప్రయత్నం చేసినా.. దర్శకుడు హారర్ (భయం) కంటే ఎక్కువగా వయలెన్స్ (హింస)పైనే నమ్మకం పెట్టుకున్నట్లు అనిపిస్తుంది.

నాలుక కోసేయడం, కళ్లు పీకేయడం, చిన్నపిల్లలను బలి ఇవ్వడం వంటి క్రూరమైన సన్నివేశాలు స్క్రీన్‌పై చాలా దారుణంగా అనిపిస్తాయి. హింసను ఇష్టపడే వారికి కాకపోయినా, ప్యూర్ హారర్ అండ్ సస్పెన్స్ కోరుకునే ప్రేక్షకులను ఈ మితిమీరిన రక్తపాతం కాస్త ఇబ్బంది పెడుతుంది. సాంకేతికంగా బాలాజీ రామస్వామి ఫొటోగ్రఫీ, అశ్విన్ కృష్ణ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. రాజ్ కుమార్ ఎడిటింగ్ పర్వాలేదు.

ముగింపు

రొటీన్ హారర్ డ్రామానే అయినప్పటికీ, తల్లీకూతుళ్ల సెంటిమెంట్, ఓ మోస్తరు భయానక వాతావరణాన్ని ఇష్టపడేవారు ఓటీటీలో ఒకసారి ట్రై చేయవచ్చు. గమనిక: ఎక్కువ హింస, రక్తపాతం ఉన్నందున పిల్లలతో కలిసి చూడటం అంత మంచిది కాదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

థియేటర్ల పర్సంటేజ్ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్, గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి చర్చలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha