Chandrababu Naidu: విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
సాయికృష్ణ అదృశ్యం ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, ఈ కేసుపై ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో ఉన్నత స్థాయి విచారణ జరిపించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Vijayawada Krishnalanka CI Nagaraju Suspended
read also: Chandrababu Naidu: యోగాంధ్ర-2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
సింగపూర్ పర్యటన ముగిసిన వెంటనే సీఎం సమీక్ష
సింగపూర్ అధికారిక పర్యటన ముగించుకుని బుధవారం తిరిగొచ్చిన వెంటనే ముఖ్యమంత్రి సచివాలయంలో అత్యవసర ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ అధిపతి మహేశ్ చంద్ర లడ్డా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయికృష్ణ కేసు పూర్వాపరాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సీఎం ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Chandrababu Naidu: అసలు ఏం జరిగిందంటే..?
కృష్ణలంకకు చెందిన సాయికృష్ణపై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే, మే 9వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురంలో కృష్ణలంక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి అతడి ఆచూకీ లభించడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తమ కుమారుడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించి ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. జూన్ 29వ తేదీ లోగా సాయికృష్ణను తమ ఎదుట ప్రవేశపెట్టాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.
ఈ వివాదం ముదరడంతో అంతకుముందే సీఐ నాగరాజును వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు బదిలీ చేసినప్పటికీ, తాజాగా ముఖ్యమంత్రి జోక్యంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

