Gaddam Prasad Kumar: బీఆర్ఎస్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి అలాగే కోవా లక్ష్మి అంటే తనకు అత్యంత గౌరవమని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వెల్లడించారు.
రాజకీయాలకు అతీతంగా వారందరూ తనకు తోబుట్టువులతో సమానమని ఆయన సభలో స్పష్టం చేశారు.

విచారణకు ఆదేశించిన స్పీకర్
సబితమ్మకు అసెంబ్లీలో జరిగిన అనుచిత ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని తానే స్వయంగా ఆదేశాలు జారీ చేసినట్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ తెలిపారు. మహిళా ప్రతినిధులకు తగిన గౌరవం దక్కాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
Gaddam Prasad Kumar: హరీష్‌రావు తీరుపై స్పీకర్ తీవ్ర ఆరోపణలు
విచారణ విషయం అలా ఉంచితే, ముందుగా తనను వ్యక్తిగతంగా అవమానించిన అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సమాధానం చెప్పాలని స్పీకర్ డిమాండ్ చేశారు. సభలో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు తన తల్లిదండ్రులను కించపరిచేలా మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లొల్లి చేస్తే భయపడేది లేదు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ సీరియస్ వార్నింగ్

