Dailyhunt
సచిన్ ఇంట్లో లక్నో ప్లేయర్స్ సందడి

సచిన్ ఇంట్లో లక్నో ప్లేయర్స్ సందడి

వార్త 1 week ago

MI vs LSG Match: వాంఖడే స్టేడియంలో నేడు జరగబోయే ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మ్యాచ్‌కి ముందు ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంటికి లక్నో జట్టు సభ్యులు విందుకు వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: PBKS vs GT Match:ఓడినా పంజాబ్ కింగ్స్ పట్టుదలను మెచ్చుకున్న అయ్యర్

ఐపీఎల్ 2026లో అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. నేడు ముంబైతో జరగబోయే మ్యాచ్ కోసం లక్నో టీమ్ ముంబైకి చేరుకోగా, తన సహచర ఆటగాళ్లను అర్జున్ తన ఇంటికి ఆహ్వానించాడు. సచిన్ టెండూల్కర్‌తో కలిసి గడిపిన ఈ క్షణాలను లక్నో ప్లేయర్స్ ఎంతో ఎంజాయ్ చేశారు.

MI vs LSG Match: విందుకు హాజరైన స్టార్స్

లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, మహమ్మద్ షమీ, మోసిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, అబ్దుల్ సమద్ వంటి ఆటగాళ్లు ఈ విందులో పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజంతో మాట్లాడటం తమకు దక్కిన గొప్ప గౌరవమని మోసిన్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ముంబైకి చావో రేవో

మరోవైపు, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఇప్పటికే ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతైన ముంబై, నేటి మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఒకవేళ నేడు లక్నో చేతిలో ఓడిపోతే, ఈ సీజన్ నుంచి అధికారికంగా నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలుస్తుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాల్సిందే: శ్రీకాంత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha