Jagga Reddy: సదాశివపేట పట్టణ త్రాగునీటి సమస్యపై నాయకులు, అధికారులతో సమీక్షించిన నిర్మలారెడ్డి, జగ్గారెడ్డి… కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని పట్టణంలోని ప్రతి ఇంటికి త్రాగు నీటిని అందించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని టీజీఐఏసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు..
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ,మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం నాడు నిర్మలారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తో కలిసి త్రాగునీటి సమస్యలపై కమిషనర్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, మిషన్ భగీరథ,పబ్లిక్ హెల్త్ అధికారులతో ఓ ఫంక్షన్ హాల్లో సమావేశమైనారు.
Read also: Bhu Bharathi : సాదా బైనామాలకు భూభారతి శాశ్వత పరిష్కారమా?

Water project review by Jagga Reddy
Jagga Reddy: 135 కోట్లతో భారీ ప్రణాళిక
50 సంవత్సరాల వరకు నీటి కొరత లేకుండా చూడాలన్న జగ్గారెడ్డి కోరిక మేరకు 135 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిరోజు గంటన్నర పాటు నీళ్లు వచ్చేలా సింగూర్ డ్యాం నుండి నేరుగా ఇంటింటికి మంచినీళ్లు అందించడానికి ఇంటెక్ వెల్, ఫిల్టర్ బెడ్, ట్యాంకులు,కొత్త పైపులైన్లు నిర్మాణం చేపట్ట వలసి వస్తుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 60 వేల జనాభాకు గాని 21 లక్షల గ్యాలన్ల మంచినీళ్లు అవసరమవుతున్నాయని కొత్త ప్రణాళిక ప్రకారం 52 లక్షల గ్యాలన్ల నీళ్లు అందుబాటులోకి వస్తాయని సంబంధిత ఇంజనీర్ తెలిపారు.
కౌన్సిల్ సమావేశం, ప్రజాభిప్రాయం
ఈ విషయమై ఈనెల 17వ తేదీన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని చర్చించాలని మునిసిపల్ చైర్మన్ అంజమ్మ సత్యనారాయణకు సూచించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డుల ప్రజలు పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని అలాగే ఎంపీ ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా కలిసి వారి సూచనలను పరిగణలోకి తీసుకోవాలని జగ్గారెడ్డి అన్నారు. అందరి అభిప్రాయాల మేరకు ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే ఈనెల 19వ తేదీన వాటిని పరిశీలించి, అదే రోజు ఇంత సమయం అయినప్పటికీ తుది రిపోర్టు నాకు గాని నిర్మలా రెడ్డి కి గాని అందించవలెనని జగ్గారెడ్డి అన్నారు.

Water project review by Jagga Reddy
ముఖ్యమంత్రితో భేటీ
మరుసటి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలను విన్నవించి రిపోర్టును అందజేస్తానని వారి సహకారంతో స్కీంకు ఆమోదం రాగానే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రెండు సంవత్సరాల లో ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుందామని అన్నారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు పేద ప్రజలకు ప్లాట్లు గాని ప్రతి వార్డుకు 8 కోట్ల అభివృద్ధినిధుల విషయమై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుందామని జగ్గారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు రెవెన్యూ ఇరిగేషన్ మిషన్ భగీరథ ముఖ్య నాయకులు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
గ్రేటర్ హైదరాబాద్‌లో సీట్ల జాతర: డీలిమిటేషన్‌తో మారనున్న భాగ్యనగర ముఖచిత్రం!

