Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సదాశివపేట12వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులు

సదాశివపేట12వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులు

వార్త 3 weeks ago

Sadashivapet Development: ప్రణాళికలు రూపొందించిన వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు., అధికారులు. సదాశివపేట పట్టణంలోని 12వ వార్డును అన్ని రంగాల్లో పట్టణంలోనే ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కౌన్సిలర్ పులిమామిడి మమత, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు తెలిపారు.

వార్డులో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

తాగునీటి సరఫరా, అంతర్గత సీసీ రోడ్లు, యూడీసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వీధి విద్యుత్ దీపాలు, ఐమాక్స్ లైట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు అవసరమైన ప్రతి సమస్యను గుర్తించి దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని అన్నారు.

 Special funds for the development of Sadashivpet’s 12th Ward

Sadashivapet Development: ప్రజల సహకారంతో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతాం

ప్రజల సహకారంతో 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజల సూచనలు, సలహాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. వార్డు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు అంకితభావంతో పనిచేస్తామని, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గన్న మార్గదర్శకత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పులిమామిడి మమత రాజు స్పష్టం చేశారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ వైద్యం ప్రసాద్, గణేష్, 12వ వార్డు ప్రజలు జబ్బార్, ఫహీం, చోటు, రాము, అనిల్, గుణాకర్, పాశ పటేల్, రామ స్వామి, రాఘవేందర్, పోల గణేష్, సోమ శంకర్, గోనె క్రిష్ణ, చింతకింది హన్మంతు మొదలగు వారు పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com

19 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగుల ఆందోళన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha