Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సైబర్ నేరాలపై చంద్రబాబు ప్రత్యేక యాక్షన్ ప్లాన్

సైబర్ నేరాలపై చంద్రబాబు ప్రత్యేక యాక్షన్ ప్లాన్

వార్త 1 week ago

సైబర్ నేరాలపై సీఎం సమీక్ష

AP Cyber Crime : ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న సైబర్, ఆర్థిక నేరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ నేరాలను అరికట్టేందుకు సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రతపై సీఎం అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రూ.652 కోట్ల నష్టం

అధికారులు సీఎం ముందు ఉంచిన వివరాల ప్రకారం రాష్ట్రంలో సైబర్, ఆర్థిక నేరాలకు సంబంధించి '1930' టోల్ ఫ్రీ నెంబర్‌కు ఇప్పటివరకు 9.29 లక్షల ఫిర్యాదులు అందాయి. ఈ మోసాల్లో బాధితులు సుమారు రూ.652 కోట్ల మేర నగదు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. ఇవే కాకుండా ఫిషింగ్, విషింగ్, క్రెడిట్ కార్డు మోసాలు, ఆన్‌లైన్ లోన్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ వంటి కొత్త తరహా సైబర్ నేరాలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని వివరించారు.

Read Also:CM Vijay: తమిళనాడులో 'విజయ్' కేక: షణ్ముగంతో కీలక భేటీ

 AP Cyber Crime

రూ.116 కోట్లు కాపాడిన అధికారులు

సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం, బ్యాంకింగ్ వ్యవస్థ సమన్వయంతో రూ.116 కోట్లకు పైగా మొత్తాన్ని నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లకుండా నిలిపివేయగలిగామని అధికారులు తెలిపారు. 'గోల్డెన్ అవర్'లో వేగంగా స్పందించడం వల్లే ఈ మొత్తాన్ని రక్షించగలిగామని చెప్పారు. దీనిపై స్పందించిన చంద్రబాబు పోలీసు యంత్రాంగం, బ్యాంకర్ల మధ్య మరింత బలమైన సమన్వయం అవసరమని సూచించారు.

ప్రత్యేక సైబర్ పాలసీకి ఆదేశం

ఇతరుల బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమగ్ర 'ఏపీ సైబర్ పాలసీ' రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. సీఐడీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పనిచేస్తోందని అధికారులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తమిళనాడులో 'విజయ్' కేక: షణ్ముగంతో కీలక భేటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha