AP Politics: రాష్ట్రంలో సైకో పార్టీ సినిమాకు శుభం కార్డు వేసేది పసుపు సైన్యమేని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ స్పష్టం చేశారు.
మీలో ఒకడిని, మీ వాడిని, అన్నగారి కుటుంబంలో అతి చిన్నవాడిని కాబట్టి అంతా కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ గౌర వాన్ని పెంచుతూ కలసికట్టుగా ముందుకు సాగుదామని నేతలకు లోకేశ్ పిలుపునిచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తన బాధ్యతను మరింత పెంచిందని స్పష్టం చేశారు. ఒక్కడిననే అహం లేకుండా కలసికట్టుగా పని చేద్దామని నాయకుల్ని కోరారు.
Read also: AP Digital Governance: డిసెంబర్ లోగా అన్ని సేవలు ఆన్‌లైన్
Nara Lokesh Speech At TDP Meeting
AP Politics: నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
మంగళగిరిలో తెలుగు దేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ముగింపు కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొని ప్రసంగించారు. ఎన్టీఆర్ ఆశయాలతో కలసి కట్టుగా పనిచేస్తూ ముందుకు సాగుదామని నాయకులకు పిలుపునిచ్చారు. ఢిల్లీ రాజకీ యాలు, గల్లీ రాజకీయాలు రెండూ తెలుగుదేశం పార్టీకి తెలుసని వెల్లడించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటు లో ఉండటమే మన బలం అన్నారు.. కార్యకర్తలకు అండగా నిలబడుతూ వారి సమస్యలు తీర్చే బాధ్యత అంతా తీసుకోవాలని సూచించారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా, చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయనే విషయం గుర్తిద్దామన్నారు.
అభివృద్ధి వర్సెస్ విధ్వంసం
రాష్ట్రంలో ఉన్న సైకో పార్టీ సినిమా విధ్వంసమైతే, తెలుగుదేశం సినిమా అభివృద్ధి అని లోకేశ్ స్పష్టం చేశారు. బెంగుళూరులో ఉంటున్న క్రెడిట్ చోరీ నాయకుడిది ఇక బెంతాహై అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. శిక్షణ తరగతుల్ని ప్రతీ ఒక్కరూ గౌరవించి హాజరు కావాలని లోకేశ్ కోరారు. అలక అనే జబ్బు వీడి సంస్కరణల కోసం కలసి పోరాడదామని పిలుపునిచ్చారు. నమ్మకున్న సిద్ధాంతాల కోసం అహర్నిశలూ కష్టపడాలని హితబోధ చేశారు.
సమిష్టి నిర్ణయం – సక్సెస్ ఫార్ములా
నాలుగు గోడల మధ్య ఎంతసేపైనా కుర్చుని ఒకరినొకరం కన్విన్స్ చేసుకుందామని కోరారు. పార్టీ నిర్ణయం తీసుకున్నాక అంతా దానికి కట్టుపడాల్సిందేనని స్పష్టం చేశారు. ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం కొనసాగేలా అమలవుతున్న సక్సెస్ ఫార్ములా ఇక్కడా అమలు కావాలని తేల్చిచెప్పారు. పార్టీ సీనియర్ నాయకులు, నేతలు లోకేక్ కు అభినందనలు తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులందరితోనూ లోకేశ్ ఫొటోలు దిగారు. కార్యక్రమం అనంతరం మహానాడు నిర్వహణపై నేతలతో సమావేశమయ్యారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

