Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సమాచార హక్కు చట్టం కమిషనర్ గాజుల ఆదెన్నకు ఘన సత్కారం

సమాచార హక్కు చట్టం కమిషనర్ గాజుల ఆదెన్నకు ఘన సత్కారం

వార్త 3 months ago

Uravakonda: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ గాజుల ఆదెన్నను ఆయన మిత్ర బృందం ఆదివారం ఘనంగా సత్కరించింది. బ్రహ్మసముద్రం మండలం కెంచానుపల్లి గ్రామానికి చెందిన గాజుల ఆదెన్న ఉరవకొండ పట్టణంలోని ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984-85 మధ్య కాలంలో 10వ తరగతి చదివారు.

Read Also:CM Revanth: కేసీఆర్, హరీష్‌లను జైల్లో పెట్టిన తర్వాతే మాట్లాడండి.. బీజేపీకి రేవంత్ వార్నింగ్

Uravakonda: గజమాలలు, శాలువాలతో సత్కారం

ఈ క్రమంలోనే ఆయన మిత్ర బృందం గాజుల అదెన్నను ఆయన చదువుకున్న పాఠశాలకు ఆహ్వానించి అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో శాలువాలు కప్పి గజమాలలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఆయన ఉరవకొండ మండల పరిధిలోని ప్రసిద్ధ పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి, బూదగవి గ్రామంలోని ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామి ఆలయాలను దర్శించుకుని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

బీఆర్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha