Telangana Assembly: తెలంగాణ శాసనసభలో బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో బీఆర్‌ఎస్ పాలన ఉన్న సమయంలో తాము ఎప్పుడూ సభను అడ్డుకోలేదని ఆయన గుర్తు చేశారు.
కానీ, నిన్నటి నుంచి బీఆర్‌ఎస్ సభ్యులు పదే పదే సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. సభా సంప్రదాయాలు తెలిసిన కేటీఆర్, హరీశ్ రావు వంటి సీనియర్ నేతలు కూడా నిబంధనలను తుంగలో తొక్కి వ్యవహరించడం శోచనీయమని విమర్శించారు.
Read also: Mamata Banerjee: రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది

They are engaging in blackmail politics: Deputy CM Bhatti Vikramarka expresses outrage.
Telangana Assembly: బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తెరలేపారు
బీఆర్‌ఎస్ నేతలు కేవలం బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని భట్టి విమర్శించారు. “ప్రతిపక్షం అడిగిన వెంటనే మేము సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం. మా ప్రభుత్వానికి దాచడానికి ఏమీ లేదు” అని ఆయన స్పష్టం చేశారు. అయితే, గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేసిన మూడు హౌస్ కమిటీల నివేదికలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఆ నివేదికలను బయట పెట్టకుండా, వాటిని అడ్డుపెట్టుకుని ఇతర పార్టీల నేతలను బ్లాక్‌మెయిల్ చేసి తమ పార్టీలో చేర్చుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ప్రజాస్వామ్య విలువలపై చర్చ
సభలో చర్చ జరగకుండా అడ్డుకోవడం ద్వారా ప్రజలకు అందాల్సిన సమాచారాన్ని బీఆర్‌ఎస్ అడ్డుకుంటోందని భట్టి విక్రమార్క అన్నారు. హౌస్ కమిటీల పేరుతో కాలయాపన చేయడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని, పారదర్శకతతోనే విచారణలు జరుపుతున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ సభ్యులు తమ తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

