Problems with the syllabus: అక్షరాలు పుస్తకాల్లో ఉంటున్నాయి. కానీ ప్రశ్నలు మాత్రం ఆకాశంలో ఉంటున్నాయి. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలకు, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు మధ్య ఉన్న అగాథాన్ని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.
ఒక విద్యార్థి తన పదేళ్ల పాఠశాల విద్యను, రెండేళ్ల ఇంటర్మీడియట్చ దువును ఎంతో శ్రద్ధగా పూర్తి చేసినా, తీరా నీట్ లేదా ఐఐటి, జెయియి వంటి పరీక్షల దగ్గరకు వచ్చేసరికి తాను చదివింది సముద్రంలో కాకి రెక్కంతేనన్న చేదు నిజాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మన విద్యా బోర్డులు రూపొందించిన సిలబస్ కేవలం ప్రాథమిక అవగాహనకు మాత్రమే పరిమితమ వుతుంటే, ప్రవేశ పరీ క్షలు మాత్రం అన్వయ సామర్ధ్యాన్ని, విశ్లేషణాత్మక ఆలో చనను కోరుతున్నాయి. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సామాన్య విద్యార్థి సమిధగా మారుతు న్నాడు. ఇంటర్మీడియట్ సిలబస్ను క్షుణ్ణంగా చదివిన విద్యార్థి కనీసం మన రాష్ట్ర స్థాయి (ఇఎపిసిఇటి)లోనైనా మెరుగైన ర్యాంకు సాధించలేకపోవడం విద్యావేత్తలను కల వరపరుస్తున్న అంశం.
Read Also: Jubilee Hills Instagram Trap:19 మంది బాలికలను ట్రాప్ చేసిన అన్నదమ్ములు !
problems with the syllabus
problems with the syllabus: మానసిక ఒత్తిడి
ఈ అంతరాన్నే పెట్టుబడిగా మార్చుకున్న కార్పొరేట్ సంస్థలు ‘ఫౌండేషన్’ పేరిట ఆరో తరగతి నుంచే విద్యార్థుల బాల్యాన్ని తరగతి గదుల నాలుగుగోడల మధ్య బంధిస్తున్నాయి. ఇక్కడ మరో విచారకరమైన అంశం ఏమిటంటే, ఈ ఫౌండేషన్ కోర్సులలో బోధించే వారిలో అత్యధికులు వృత్తిపరమైన ఉపాధ్యాయ శిక్షణ(బి.ఇడి/ఎం.ఇ) పొందిన వారు కాదు. టీచింగ్ మెథడాలజీపై కనీస అవగా హన లేని, కేవలం బి.టెక్ లేదా ఎమ్ఎస్సీ చదివిన యువ కులతో ఈ బోధన సాగుతోంది. వీరికి సబ్జెక్టుపై పట్టు ఉండ వచ్చు కానీ, ఒక విద్యార్థి మానసిక స్థితిని అర్థం చేసుకుని, వారి వయస్సుకి అనుగుణంగా విషయాన్ని ఎలా చేరవేయా లో తెలియదు. దీనివల్ల బోధన అనేది ఒక యాంత్రిక ప్రక్రి యగా మారి, విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతోంది. సృజనాత్మకతకు తావులేని ఈ ‘ర్యాంకుల ఫ్యాక్టరీల’లో విద్యార్థులు కేవలం సమస్యలను పరిష్కరించే యంత్రాలుగా మారుతున్నారు. ఈఫౌండేషన్పాఠశాలల ధోరణి విద్యార్థుల సమగ్ర వికాసాన్ని దెబ్బతీస్తోంది. ఇక్కడ కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీవశాస్త్రాలు వంటి సబ్జెక్టులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, భాషలు, సోషల్ స్టడీస్ను పూర్తిగా విస్మరిస్తున్నారు. దీనివల్ల సాహిత్యం, చరిత్ర, సామాజిక అంశాల్లో అత్యంత చురుకైన విద్యార్థులు కూడా తాము దేనికీ పనికిరామనే న్యూనతాభావానికి లోన వుతున్నారు.
ప్రత్యేక శిక్షణ
మరీ ముఖ్యంగా, ఈ ఉరుకుల పరుగుల చదు వుల్లో ‘వ్యాయామ విద్య’ అన్న మాటే వినిపించడం లేదు. ఆటపాటలకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో విద్యార్థు ల్లో శారీరక దారుఢ్యం క్షీణిస్తోంది. క్రీడలు లేని విద్య కేవ లం మెదడును నింపుతుందే తప్ప, శరీరాన్ని బలపరచదు. నేడు పోలీస్, రక్షణ రంగాల ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న శారీరక పరీక్షల్లో అభ్యర్థులు స్పృహ తప్పి పడిపోవడం మనం చూస్తున్నాం. భవిష్యత్తులో దేశ రక్షణకు కావలసిన దృఢమైన యువత కరువయ్యే ప్రమాదం పొంచి ఉంది. కేవలం కుర్చీలకే పరిమితమై పుస్తకాలతో కుస్తీ పట్టే ఈ యువత, క్షేత్రస్థాయిలో శారీరక సవాళ్లను ఎలా ఎదుర్కో గలరు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. దీని ప్రభావం నేరుగా ప్రభుత్వ విద్యా సంస్థలపై పడుతోంది. ఒకప్పుడు ప్రతిభా వంతులకు చిరునామాగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళా శాలలు నేడు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ప్రవేశ పరీక్షలకు కావాల్సిన ప్రత్యేక శిక్షణ అక్కడ దొరకదన్న ఉద్దేశంతో మెరిటోరియస్ విద్యార్థులందరూ కార్పొరేట్ బాట పడుతున్నారు. స్తోమత లేని వారు నాసిరకం కోచింగ్ సెంటర్లలో చేరి, అటు విద్య అందక, ఇటు కెరీర్ పట్ల స్పష్టత లేక మధ్యలోనే ఆగిపోతున్నారు.
problems with the syllabus
క్రీడలను తప్పని సరి చేయాలి
ఇది కేవలం ఒక విద్యాపరమైన సమస్య మాత్రమేకాదు, సామాజిక సంక్షోభం కూడా. అందరూ కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్ల వేట లో పడితే, రేపు విశ్వవిద్యాలయాల్లో ప్రాథమిక శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు చదివి సమాజ హితమైన పరిశోధనలు చేసేవారెవరు? చరిత్రను విశ్లేషించేవారు, సాహిత్యాన్ని ప్రేమిం చేవారు, సామాజిక మార్పు కోసం తపించే మేధావుల కొరత భవిష్యత్తులో దేశాభివృద్ధిని కుంటుపరిచే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు కావాల్సింది నామమాత్రపు మార్పు లు కాదు, సమూలమైన సంస్కరణలు. ప్రవేశ పరీక్షల స్థాయి కి అనుగుణంగా ప్రభుత్వ పాఠ్యప్రణాళికను ఆధునీకరిం చాలి లేదా ఆ పరీక్షల క్లిష్టతను మన విద్యా ప్రమాణాలకు తగ్గిం చాలి. పాఠశాలస్థాయి నుంచే కేవలం బట్టీపట్టడం కాకుండా, విషయాన్ని విశ్లేషించే నైపుణ్యాలను పెంపొందిం చే విధంగా బోధనా పద్ధతులు మారాలి. విద్యతోపాటు క్రీడలను తప్పని సరి చేయాలి. అప్పుడే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. తల్లి దండ్రులకు ఆర్థిక భారం తప్పుతుంది. ప్రతిభావంతు లైన విద్యార్థులు ప్రభుత్వ సంస్థల్లోనే ఉంటూ దేశానికి అవసరమైన అన్ని రంగాల్లోనూ రాణించే అవకాశం కలుగు తుంది. అక్షరానికి, ఆశయానికి మధ్య ఉన్న ఈ అడ్డుగోడ లను తొలగించడమే నేటి విద్యావ్యవస్థ ముందున్న తక్షణ కర్తవ్యం. ఒక సంపూర్ణ మానవుడిని తయారు చేయాల్సిన విద్య, కేవలం ఒక ప్రవేశ పరీక్షకు సిద్ధం చేసే సాధనంగా మిగిలిపోకూడదు.
-మర్రాపు వసుంధరా దేవి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

