Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సమరసింహారెడ్డి' రీ-రిలీజ్..ఫ్యాన్స్‌కు పూనకాలే

'సమరసింహారెడ్డి' రీ-రిలీజ్..ఫ్యాన్స్‌కు పూనకాలే

వార్త 1 week ago

Balayya Birthday: తెలుగు చలనచిత్ర రంగంలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజున అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారు.

ఆయన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ అయిన ‘సమరసింహారెడ్డి’ జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కాబోతోంది. 1999లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. ఫ్యాక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా బాలయ్యకు మాస్ ఆడియన్స్‌లో తిరుగులేని ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.

Read Also:Dhurandhar 2 OTT Release Date: 'ధురంధర్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Balayya Birthday: 25 ఏళ్ల తర్వాత మళ్లీ సింహం గర్జన

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ సినిమాలకు వస్తున్న స్పందన చూస్తుంటే, ‘సమరసింహారెడ్డి’కి కూడా థియేటర్ల వద్ద జాతర ఖాయమనిపిస్తోంది. 25 ఏళ్ల తర్వాత ఈ పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ డ్రామాను మళ్లీ వెండితెరపై చూసేందుకు నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇందులోని డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ మరియు మణిశర్మ అందించిన పాటలు నేటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ పుట్టినరోజున బాలయ్య కొత్త సినిమాల ప్రకటనలతో పాటు, ఈ రీ-రిలీజ్ సందడి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha